section - 8
-
సెక్షన్ 8పై మాట్లాడితే నాలుక చీరేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆంధ్రా నేతల తరహాలో మాట్లాడుతున్నారని, సెక్షన్ 8పై వారు చేసిన వ్యాఖ్యల ద్వారా నిజ స్వరూపం బట్టబయలైందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అస్తిత్వంపై రాజీ పడేది లేదని, ఎవరైనా సెక్షన్ 8 గురించి మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై ఇతరుల పెత్తనం సహించేది లేదని, బానిస తెలంగాణను అనుమతించేది లేదన్నారు. పరాయి మనస్తత్వ బానిస నేతలపై ప్రాణాలకు తెగించి పోరాడతామని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఏనాడూ తెలంగాణ కోసం పోరాడలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల వల్లే తెలంగాణ ఏడు మండలాలను కోల్పోయిందని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్రానికి ద్రోహంచేస్తున్న కాంగ్రెస్, బీజేపీ తెలంగాణపై విషం చిమ్మడమే పనిగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని హర్షిస్తున్నాయని, కాంగ్రెస్, బీజేపీ మాత్రం సొంత రాష్ట్రానికి ద్రోహం చేయడమే విధానంగా పెట్టుకున్నాయన్నారు. బుధవారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సచివాలయంపై కోర్టు తీర్పుకోసం ఏడాది పాటు ఎదురుచూశామని, సచివాలయ నిర్మాణం వద్దనే వారు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సచివాలయంతో ప్రజాధనం వృధా కాదని, రాష్ట్రానికి కొత్త సచివాలయం తలమానికంగా నిలుస్తుందన్నారు. -
రాష్ట్రపతితో భేటీకానున్న ఏపీ మంత్రులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రులు మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణ, రావెల కిషోర్ బాబు రాష్ట్రపతితో ఈ రోజు భేటీ కాబోతున్నారు. సెక్షన్ -8 అంశం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 లోని ఉమ్మడి సంస్థల వివాదాలపై ప్రణబ్ ముఖర్జీకి ఈ భేటీలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. శీతాకాల విడిది కోసం ప్రణబ్ హైదరాబాద్ లోని బొల్లారంలో ఉంటున్న విషయం విదితమే. -
కిరికిరి చేస్తే ఊరుకోం
చంద్రబాబుకు శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి సెక్షన్-8ని తెరపైకి తెచ్చారని, ఇలాంటి కిరికిరిలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 10వ షెడ్యూల్లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో ఏపీ అధికారిని నియమించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. 9వ షెడ్యూలోని 85 సంస్థలను విభజించకుండా బాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విధి విధానాలకు, హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బాబు వ్యవహరిస్తూ ఏపీ-తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకోవాలని బాబు చూస్తున్నారని ఆరోపించారు. -
సెక్షన్-8 అమలు చేసేలా ఆదేశాలివ్వండి
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇరు రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజన చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఒత్తిళ్లకు లోనై అత్యుత్సాహంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని తీసుకుకొచ్చారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న ప్రజల రక్షణకు కేంద్రం ఈ చట్టంలో కొన్ని రక్షణ చర్యలు చేపట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా గత ఏడాది కాలంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయని, ఆ ఘటనలు ప్రజల జీవించే హక్కును కాలరాసే విధంగా ఉన్నాయని వివరించారు. -
ఏడాదిలో ఒక్క సెటిలర్‌కూ నష్టం జరగలేదు
తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క సెటిలర్ ధన, ప్రాణ, మాన నష్టం జరగలేదని.. ఈ సమయంలో సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. అదే సమయంలో సీమాంధ్రుల భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని సెక్షన్-8ను పూర్తిగా తొలగించవద్దని ఆమె డిమాండ్ చేశారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగున్నాయని, ప్రస్తుత పాలనపై సెటిలర్లు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఏపీ ప్రభుత్వం అడుగుతున్న డిమాండ్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని, హైదరాబాద్‌లో ఏదో జరిగిపోతుందని తమ గురించి సెక్షన్-8 అమలు చేయాలనడం సరికాదన్నారు. సెక్షన్-8 రాజకీయాలకు, నేతలకు సంబంధించిన విషయం కాదని.. ఇది ఇక్కడ స్థిరపడ్డ కోటి 20 లక్షల సీమాంధ్రుల ఆత్మగౌరవమని ఇరు రాష్ట్రాల నేతలు గ్రహించాలని సూచించారు. -
'పదేళ్లు ఉంటాం.. 10 నిమిషాలు కూడా వదలం'
మహారాణిపేట (విశాఖపట్నం): వచ్చే పదేళ్లలో కనీసం పది నిమిషాలు కూడా వదలకుందా హైదరాబాద్ లోనే ఉంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. సెక్షన్ -8 విషయంలో గవర్నర్ ఇంకా మీనమేషాలు లెక్కించడం సబబు కాదని ఆయన అన్నారు. వెంటనే కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఒకవేళ సెక్షన్ -8 అమలు చేయకుంటే పోలీసు వ్యవస్థను తామే ఏర్పాటు చేసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. సమాంతర పరిపాలన ఉండకూడదనుకుంటే గవర్నర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా రాద్ధాంతం చేస్తే లక్షలాది మందితో మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. సెక్షన్ 8ను అమలు చేయకుంటే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్‌తో ఉద్యమిస్తామన్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, జీహెచ్ఎంసీ వంటి వాటిని గవర్నర్ తన ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు రక్షణ లేదని, వారిని కేసీఆర్ ప్రభుత్వం దోషుల్లా చూస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గవర్నర్ 'సెక్షన్ -8' తక్షణమే అమలు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్య నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేవలం 10 జిల్లాలకు మాత్రమే సీఎం అని.. తాము కూడా కేంద్రాన్ని బెదిరించగలమని ఈ సందర్భంగా బండారు వ్యాఖ్యానించారు. ఇంకా పదేళ్ల పాటు హైదరాబాద్ లోనే ఉంటామని ఆయన అన్నారు.