ఏడాదిలో ఒక్క సెటిలర్‌కూ నష్టం జరగలేదు | One settlers of the year For both Loss did not | Sakshi
Sakshi News home page

ఏడాదిలో ఒక్క సెటిలర్‌కూ నష్టం జరగలేదు

Published Fri, Jun 26 2015 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

ఏడాదిలో ఒక్క సెటిలర్‌కూ నష్టం జరగలేదు

ఏడాదిలో ఒక్క సెటిలర్‌కూ నష్టం జరగలేదు

తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క సెటిలర్ ధన, ప్రాణ, మాన నష్టం జరగలేదని.. ఈ సమయంలో సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. అదే సమయంలో సీమాంధ్రుల భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని సెక్షన్-8ను పూర్తిగా తొలగించవద్దని ఆమె డిమాండ్ చేశారు.

గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగున్నాయని, ప్రస్తుత పాలనపై సెటిలర్లు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఏపీ ప్రభుత్వం అడుగుతున్న డిమాండ్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని, హైదరాబాద్‌లో ఏదో జరిగిపోతుందని తమ గురించి సెక్షన్-8 అమలు చేయాలనడం సరికాదన్నారు. సెక్షన్-8 రాజకీయాలకు, నేతలకు సంబంధించిన విషయం కాదని.. ఇది ఇక్కడ స్థిరపడ్డ కోటి 20 లక్షల సీమాంధ్రుల ఆత్మగౌరవమని ఇరు రాష్ట్రాల నేతలు గ్రహించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement