హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేత్రాంజలి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు విశిష్ట మహిళా పురస్కారాలను అందజేయనున్నట్లు సంస్థ ఉపాధ్యక్షురాలు శారదా ప్రసాద్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే మహిళా దినోత్సవాల్లో ఉత్తమ మాతృమూర్తితో పాటు గృహిణి, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్, టీచింగ్, రాజకీయం, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు.
అదే రోజు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి పురస్కారాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన దలచిన మహిళలు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, బయోడేటాతో రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 95736 68127 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.