పకడ్బందీగా ‘బతుకమ్మ' ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ టౌన్:
జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవపరమైన ఏర్పాట్లు చేయూలని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఏర్పాట్లపై శుక్రవారం మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ నెల 24నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు పండుగను నిర్వహించేందుకు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని డిఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. వీరితోపాటు, మహిళా సంఘాలతోపాటు, అంగన్‌వాడీ మహిళలు, మహిళా ఉపాధ్యాయులను భాగస్వాములను చేయూల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకుగాను పట్టణాల్లో మున్సిపల్ అధికారులు మైదానాలను అందంగా తీర్చిదిద్దటంతో పాటు, మిహ ళలు బతుకమ్మను ఆడుకునేందుకు వీలుగా సర్కిళ్లు ఏర్పాటు చేయూలని ఆదేశించారు. గ్రామస్థాయిలో సర్పంచుల ఆధ్వర్యంలో వేడకలు నిర్వహించాలని, బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువులు, కుంటలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దీంతోపాటు ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించాలని, విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ నిర్వహించే మైదానల్లో లైటింగ్, జనరేటర్లను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణం, గ్రామీణప్రాంతాల్లోని చౌరస్తాలను అందంగా అలంకరించి పండుగ వాతావరణాన్ని తలపించేలా చూడాలన్నారు. ఆహ్వాన కమిటీ, ఉత్సవ కమిటీలు ఏర్పాట్లను పర్యవేక్షించాల్సి ఉంటోందని, ఈకమిటీల్లో మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల్లో కళాజాత బృందాల ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలని ప్రజలకు వివరించేలా చూడాలన్నారు. చెరువుల వద్ద మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో జేిసీ ఎల్.శర్మన్, డీఆర్‌ఓ రాంకిషన్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ హరిత, మైక్రో ఇరిగేషన్ అధికారి సురేశ్, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.