సంచలనం కలిగించిన మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ ఘటనపై రెండు జిల్లాల పోలీసులు చర్యలు ప్రారంభించారు. శ్రీహరి అనే మృతితో సంబంధం ఉందంటూ శుక్రవారం గ్రామంలో సర్పంచి ఇంటిపై దాడి జరిగిన విషయం విదితమే. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపూర్ సర్పంచి కుంబాల లక్ష్మి కుటుంబసభ్యులు ఆరుగురిపై కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. సర్పంచి సంబంధీకులు కొట్టడంతోనే శ్రీహరి చనిపోయాడంటూ అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో సర్పంచి కుమారులు ఎల్లారెడ్డి, నాగిరెడ్డితోపాటు కుటుంబసభ్యులు ర జినీకాంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డిలపై హత్యకేసు నమోదుచేశారు. మరోవైపు సర్పంచి ఇంటిపై దాడి, ధ్వంసంతోపాటు మీడియా, పోలీసులపై దాడికి పాల్పడి న ఘటనల్లో పాల్గొన్న మృతుడు శ్రీహరి బంధువులు జిల్లెల్ల, తెర్లుమద్ది గ్రామాలకు చెందిన 30 మందిపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు మెదక్ ఎస్పీ సుమతి తెలిపారు. అరెస్టయిన వారిలో తెర్లుమద్ది సర్పంచి కృష్ణ కూడా ఉన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన పది మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఇబ్రహీంపూర్ ఘటనలో నిందితుల అరెస్టు
Published Sat, Jan 9 2016 7:51 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM