హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధులు తిరిగి వచ్చారు. ప్రస్తుత రాజకీయనాయకులు కూడా అందరూ ఒకే దగ్గరకు చేరుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామీ ప్రధాన పాత్రలో వీరంతా భారత దేశ భవిష్యత్తు గురించి పలు ఆసక్తికర అంశాలను స్పృశించారు. ఇదంతా ఏంటా అనుకుంటున్నారా? సెయింట్ ఆన్స్ మహిళా జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆర్ట్స్ విద్యార్ధులు శనివారం ఉదయం చేసిన నాటికలోని సారాంశం.
ప్రముఖ హాలీవుడ్ మూవీ 'నైట్ ఎట్ మ్యూజియం' కథ ఆధారంగా సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులు 'రోల్ ప్లే'నాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో మ్యూజియానికి వెళ్లిన ఆర్నబ్ గోస్వామీ తన వస్తువును మరచిపోతాడు. తిరిగి మ్యూజియం వెళ్లి చూసే సరికి మ్యూజియంలోని స్వాతంత్ర్య సమరయోధులు(భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీభాయ్, అనిబిసెంట్, మహాత్మా గాంధీ) తిరిగి వస్తారు. వీరితో పాటు ప్రస్తుత రాజకీయ నాయకులు( లాలు ప్రసాద్ యాదవ్, సృతి ఇరానీ, జయలలిత) కూడా వేదికపై దర్శనమిస్తారు. ఈ నాటికలో ఆర్నబ్ గోస్వామి దేశ భవిష్యత్తు మీద విద్యార్థుల(పాత్ర దారులు)తో కలిసి సరికొత్త అంశంపై చర్చాగోష్టి నిర్వహించడం అందర్నీ ఆకట్టుకుంది. వీరందరిని ఆర్నబ్ అడిగే ప్రశ్నలు వీక్షకుల్ని ఆలోచింపజేసేవిలా ఉంటాయి. ఈ కథతో చేసిన నాటిక అందరిలో దేశభక్తిని పెంచేలా చేసిందని ప్రిన్సిపల్ పుష్పలీలా కొనియాడారు.
ఆకట్టుకున్న 'రోల్ ప్లే' నాటిక
Published Sat, Jun 20 2015 2:10 PM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM
Advertisement