బతికుండగానే సమాధి..
మద్దూరు: జీవించి ఉండగానే ఓ ఘనుడు ఘోరీ కట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా మద్దూరు మండలంలోని ైబె రాన్‌పల్లికి చెందిన బూర మల్లయ్య, ఈశ్వరమ్మ పెద్ద కుమారుడు అరుున ఎల్లయ్య 15 సంవత్సరాల క్రితమే సమాధి కట్టించుకున్నాడు తన తల్లి ఈశ్వరమ్మ 1985లో మృతి చెందగా... ఆమె అంత్యక్రియలను ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెల్లు చేయలేకపోవడంతో గ్రామంలో అభాసుపాలయ్యారు. తన తల్లికి జరిగిన అవమాన దుస్థితి తనకు మృతి చెందిన తర్వాత జరగకూడదన్న ఉద్దేశంతో 15 సంవత్సరాల క్రితం తన సమాధిని తానే నిర్మించుకున్నాడు.
ఈ విషయమై ‘సాక్షి’ ఎల్లయ్యను సంప్రదించగా... ‘నేను మృతి చెందిన తర్వాత నా కొడుకులు సమాధి నిర్మించరనే అనుమానంతో స్వయంగా నేనే కట్టించుకున్నా. 15 సంవత్సరాలు దాటినా నాకు చావురావడం లేదు. నాకుమారుల , కూతుళ్ల వివాహాలు అయినాయ్. సంతోషంగా ఉంది.’ అని చెప్పడం స్థానికులను ఆశ్చర్యపరిచింది.