
గుండెపోటుతో యువ ఎస్సై మృతి
ఆదిలాబాద్: ఓ యువ ఎస్సై గుండెపోటుకు గురై మృతిచెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఆర్. ఉమా మహేష్(29) 2012 లో ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. విధుల్లో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నివాసముంటున్నాడు.
ఈ క్రమంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి ఖానాపూర్‌కు వచ్చాడు. ఈ రోజు ఉదయం గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు నిర్మల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య ఒక పాప ఉంది. మహేష్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.