గాడితప్పిన పాలన: రమణ
సాక్షి, జగిత్యాల: ప్రగతి భవన్ పైరవీల భవన్‌గా మారిందని, పాలన గాడి తప్పిందని టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఎద్దేవా చేశారు. మూడేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో నివేదికలు వెల్లడించినట్లు బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. మియాపూర్ భూకుం భకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటివరకు రైతులకు పంట రుణాలు.. సలహాలు.. సూచనల జాడేలేదన్నారు. పండించిన పంటకు ధాన్యం సేకరణ పూర్తయి 50 రోజులు గడుస్తున్నా ఉత్తర తెలంగాణ రైతులకు డబ్బులు అందలేదన్నారు. మూడేళ్లయినా సీఎంకు పాలనపై అవగాహన రాలేదని చురకలంటించారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.