పెళ్లికి నిరాకరించిందని.. | attack with acid on lover in nirmal | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించిందని..

Published Sat, Nov 8 2014 3:05 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

పెళ్లికి నిరాకరించిందని.. - Sakshi

పెళ్లికి నిరాకరించిందని..

నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలో శుక్రవారం యువతిపై జరిగిన యాసిడ్ దాడి సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎప్పుడూ నిర్మలంగా ఉండే పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ పక్క సీఎం కేసీఆర్ యువతులపై దాడులు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న క్రమంలో.. బడ్జెట్‌లో మహిళల భద్రతకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి 48 గంటలైనా గడవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

పెళ్లికి జాప్యం చేస్తుందని ఆగ్రహించిన యువకుడు ఓ యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... కడెం మండలానికి చెందిన ఎండీ మునీర్, లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన హంసరాణి నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలిసి చదువుకున్నారు. డిగ్రీ చదువుతుండగా ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. మునీర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రై వేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, హంసరాణి ఇటీవలే బీఈడీ పూర్తిచేసింది.

ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వచ్చిన మునీర్, న ర్సాపూర్(జి) గ్రామంలోని బంధువుల ఇంటి కి వెళ్లిన హంస మధ్యాహ్నం నిర్మల్‌లో కలుసుకున్నారు. బస్టాండ్ సమీపంలోని ప్రియదర్శినినగర్‌లో మాట్లాడుకుంటుండగా.. పెళ్లి విషయమై ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వ చ్చాయి. దీంతో మునీర్ తనవెంట తెచ్చుకున్న యాసిడ్‌తో ఆమెపై దాడి చేశాడు. హంస నెత్తి పై యాసిడ్ పడటంతో మంటతో అరిచింది.

దీంతో కంగారుపడ్డ నిందితుడు ఆమెను వెం టనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్ర యత్నించగా స్థానికులు పోలీసులకు సమాచా రం అందజేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న హంస నుంచి పట్టణ సీఐ పింగళి ప్రశాంత్‌రెడ్డి సమాచారాన్ని సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునీర్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మాధవరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడిం చారు.

దీనిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య విలేకరులతో మాట్లాడు తూ.. ప్రేమ పేరుతో విద్యార్థినులను టార్గెట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు సింగరి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు శేఖర్, పీవోడబ్ల్యూవో జిల్లా ఉపాధ్యక్షురాలు కె.లక్ష్మి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

 మహిళల భద్రతకు ప్రత్యేక బృందాలు..
 జిల్లాలో మహిళల భద్రతకు ప్రత్యేక బృందా లు ఏర్పాటు చేస్తామని ఎస్పీ గజరావు భూపా ల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ని ర్మల్‌లో యాసిడ్ దాడి వంటి ఘటనలు జిల్లా లో పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. కళాశాలల్లో, పార్కుల వద్ద మహిళ పోలీసులకు విధులు వేస్తామని ఎస్పీ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement