అదిలాబాద్(కానాపూర్): సారా తయారి కేంద్రాలపై పోలీసులు పంజా విసిరారు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్‌నంది గ్రామపంచాయతీ పరిధిలోని కొముటండా ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు గుడంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 50 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడంతొ పాటు 1500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.