ఖమ్మం: కాకినాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం అర్ధరాత్రి 12.30 సమయంలో దొంగలు దోపిడీకి యుత్నించారు. విజయువాడ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న రైలు కొండపల్లి దాటాక ఎనిమిది నుంచి పదిమంది దొంగలు చైన్‌లాగి రైలును ఆపారు. ఎస్-1, ఎస్-2, ఎస్-8 బోగీల్లో ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించి వారి వద్దనుంచి నగదు, బంగారు ఆభరణాలను దోచుకునేందుకు యత్నించగా ప్రయాణికులు ప్రతిఘటించారు. దీంతో వారు కొంతసేపు బీభత్సం సృష్టించారు. చివరికి ఎస్ 8 బోగీలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రేవతి వద్ద రెండు తులాల బంగారు గొలుసు దోచుకువెళ్లారు. అలర్ట్ అరుున ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడకు వచ్చేలోగానే దొంగలు పారిపోయూరు.