ఆటో కారు ఢీ.. ఇద్దరి మృతి | Auto car collided two killed | Sakshi
Sakshi News home page

ఆటో కారు ఢీ.. ఇద్దరి మృతి

Published Sun, Jan 31 2016 4:16 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Auto car collided two killed

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట్ సమీపంలో ఆదివారం ఆటో - కారు ఢీకొన్నాయి.

ఈ ఘటనలో నర్సయ్య(50)తో పాటు ఆటో డ్రైవర్ రవి(35) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాల య్యాయి. కామారెడ్డి నుంచి మాచారెడ్డి వెళ్తున్న ఆటోను ఎదరుగా వస్తున్న కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement