కరపత్రాలను ఆవిష్కరిస్తున్న డాక్టర్ రాములు
నిజామాబాద్‌అర్బన్: బైపోలార్ వ్యాధిపై అవగాహన ముఖ్యమని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు అన్నారు. శుక్రవారం కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అంతర్జాతీయ బైపోలార్ వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక వ్యాధులపై అవగాహన కలి గి ఉంటే వ్యాధులను నియంత్రించుకోవచ్చన్నారు. అనంతరం ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ విశాల్ మాట్లాడుతూ బైపోలార్ వ్యాధి అంటే ఒక మనిషిలో రెండు రకాల పరస్పర వ్యతిరేక లక్షణాలు ఉంటాయని తెలిపారు. మానియా, డిప్రెషన్ రెండు రకాల లక్షణాలు ఉంటాయన్నారు.
మాని యా దశలో మితిమీరిన సంతోషం, ఆత్మవిశ్వాసం, అతిగా గొప్పలు చెప్పడం, నృత్యం చేయడం, పాట లు పాడడం, అతిగా సెక్స్ కోరికలు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుంటారన్నారు. డిప్రెషన్ దశలో తీవ్రమైన మానసిక బాధ, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, ఏ పనిపైనా స్పష్టత లేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం, పూర్తిగా నిరాశకు లోనవుతారని సూచించారు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా, మానసిక ఒత్తిళ్ల వలన వస్తుందని చెప్పారు. ఆధునిక చికిత్స ద్వారా దీనిని నివారించవచ్చనన్నారు. సదస్సులో వైద్యులు డాక్టర్ బన్సిలాల్, డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment