సంగారెడ్డి క్రైం: ఓ పసికందు మృతదేహం కుక్కలపాలైంది. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రి ఆవరణలోని ముళ్లపొదల్లో సోమవారం మగ శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో ఎవరైనా కాన్పు కోసం వచ్చి శిశువు మృతి చెందడంతో పడేసి ఉంటారా? లేక ఇంకెవరైనా పడేశారా? అనే అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరిపారు.