♦ ‘పాలమూరు’ను నిర్మించి తీరుతాం
♦ అఖిలపక్ష సమావేశంలో మంత్రి జూపల్లి
కల్వకుర్త : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎవరైనా అడ్డొస్తే అంతుచూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలో పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను వెనక్కి తెప్పిస్తారా? లేక ఇక్కడ టీడీపీ దుకాణం మూసుకుంటారని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి వచ్చే ఏడాది జూన్‌లో పూర్తిస్థాయిలో నీరు సరఫరా అవుతుందన్నారు. కొల్లాపూర్‌కు మాత్రమే కెఎల్‌ఐ నీరు తీసుకుపోయారని అనడం సరికాదన్నారు.
మాజీ ఎంపీ మందా జగన్నాథం మా ట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల మూ డేళ్లలో పూర్తికావడం సాధ్యం కాకపోవచ్చుగాని, అన్ని అనుమతులు ఉంటే నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. ఉమ్మడి రాష్టంలో అన్నిదోచుకుపోయి తిరిగి ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నీళ్లు దోచుకోవడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు.
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కనపెట్టి పాలమూరు ఎత్తిపోతల పథకం సాధించడమే లక్ష్యంగా ముందుకుపోదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముందుగా క ల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఇక్కడి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని కాలయాపన చేయవద్దని అన్నారు.
బీజేసీ సభ్యుడు హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టి మరో ఉద్యమం కమిటీలని కాలయాపన చేయాలని టీఆర్‌ఎస్ చూడటం సరికాదని సూ చించారు. పాలమూరు ఎత్తిపోతల నిర్మిం చడానికి ప్రణాళికాబద్దంగా ముందుకు పోవడంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి సిద్ధంకావాలని సూచిం చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ శ్రీశైలం, జెడ్పీటీసీ సభ్యులు రవి, నర్సింహ, వైస్ ఎంపీపీ పర్వతాలుగౌడ్, వెంకటయ్య, నాయకులు బాలాజీసింగ్, ఆనంద్‌కుమార్, విజితారెడ్డి, విజయ్‌గౌడ్, కౌన్సిలర్ సూర్యప్రకాష్‌రావు, బీజేసీ నాయకులు దుర్గప్రసాద్, కృష్ణగౌడ్, రాంరెడ్డి, బీఎస్‌సీ నేత కె.జం గయ్య, సీపీఎం నాయకులు, విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు.
బాబు కుట్రలను తిప్పికొడదాం
Published Thu, Jul 16 2015 4:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement