కబ్జాదారులకు మాజీ మంత్రి అండ | Backed by the former Minister of land grabbing | Sakshi
Sakshi News home page

కబ్జాదారులకు మాజీ మంత్రి అండ

Published Tue, Mar 18 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

కబ్జాదారులకు మాజీ మంత్రి అండ

కబ్జాదారులకు మాజీ మంత్రి అండ

 పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి
 బసంత్ నగర్, న్యూస్‌లైన్ :  మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అండదండలతోనే జిల్లాలో భూకబ్జాదారుల ఆగడాలు ఎక్కువయ్యాయని పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి ఆరోపించారు. కన్నాలలో భూకబ్జా చేశారనే కారణంతో ఆత్మహత్య చేసుకున్న గణపతి ప్రభాకర్ కుటుంబాన్ని  సోమవారం ఆయన పౌరహక్కుల సంఘం నాయకులతో కలిసి పరామర్శించారు.
 
 అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారుల వైఫల్యంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. ఇందుకు అధికారులతో పాటు స్థానిక ఫోర్‌లైన్ కాంట్రాక్ట్ సంస్థ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. కన్నాల బోడ గుట్టపై అక్రమ మైనింగ్ కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
 
  మృతుడి కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆక్రమణకు గురైన మృతుడి భూమిని పరిశీలించారు. ఆయన వెంట సంఘం ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు ప్రసాద్, కోశాధికారి అక్బర్, కార్యవర్గ సభ్యుడు రాజగోపాల్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement