Civil society
-
రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచేలా ఈనాడు రాతలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలో పనిచేసే కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అగాధం సృష్టించడం, వాటిని కించపరచడమే లక్ష్యంగా ఈనాడు దురుద్దేశపూర్వక కథనాలను ప్రచురిస్తోందంటూ పౌర సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రెండు వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చి, ప్రజల్లో చులకన చేసే లక్ష్యంతో పెన్షన్ల పంపిణీపై ‘ఎవరి ఆధీనంలో ఎవరు’ అంటూ కథనాన్ని ప్రచురించారంటూ ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం ఆదివారం ఫిర్యాదు చేశాయి.ఈ సందర్భంగా ఏపీ ఇంటిలెక్చువల్ అండ్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు పి. విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడు కథనం ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం పారదర్శకత, సమగ్రత, నిబద్ధతను ఈ కథనం ప్రశి్నంచేదిగా ఉందన్నారు. ఈ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా వార్తలు పత్రికా విలువలను, నైతికతను దిగజార్చేలా ఉన్నందున, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా జోక్యం తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఫోరం అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చందని, వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ కూడా పాటించిందని చెప్పారు. అయినప్పటికీ, ఈ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం లేదనే విధంగా ఈనాడు కథనం ఉండటం శోచనీయమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం ఇస్తున్న ఆదేశాలను సీఎస్ తూచ తప్పకుండా పాటిస్తున్నప్పటికీ, ఆయన పనితీరుపై అపోహలు కలి్పంచేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాలను దించి వేయడం, వాటికి అనుకూలమైన పార్టీలను అందలం ఎక్కించడం అనే రాజ్యాంగ విరుద్ధమైన బాధ్యతను భుజాలకెత్తుకున్నాయని కృష్ణంరాజు విమర్శించారు. ప్రభుత్వాల పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రజలే వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారని, కానీ వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలను ప్రచురించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. -
‘ఇండియా’కు మద్దతు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమికి 18 చిన్న పార్టీలు, 50కి పైగా పౌర సంఘాలు మద్దతు ప్రకటించాయి. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆ కూటమిలోని పారీ్టల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ‘ఇండియా గెలుస్తుంది: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సామాజిక న్యాయం కోసం జాతీయ సదస్సు‘ పేరుతో వాటి నేతలు శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. ముఖ్యంగా విపక్ష అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోతున్న 100 నుంచి 150 లోక్‌సభ స్థానాల్లో ఈసారి వారికి దన్నుగా నిలుస్తామని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 20కి పైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరైనట్టు చెప్పారు. -
జీవో నంబర్ 1లో నిషేధమనే పదమే లేదు
ఏఎన్‌యూ: ప్రజల ప్రాణాలు, జీవితాలను కాపాడేందుకు రోడ్లపై బహిరంగ సభల విషయంలో నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేధావుల ఐక్యవేదిక కొనియాడింది. జీవో నంబర్ 1లో బహిరంగ సమావేశాలు నిషేధమనే పదమే లేదని వక్తలు గుర్తు చేశారు. నియంత్రణకు, నిషేధానికి చాలా వ్యత్యాసం ఉందనేది గుర్తించాలని సూచించారు. తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుందని నిలదీశారు. ప్రజా సంరక్షణ చర్యలు చేపట్టడం పాలకుల కనీస బాధ్యతనే విషయం మరిచిపోకూడదన్నారు. ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం అమల్లోకి తెస్తే దానిపై అవగాహన కల్పించడం మీడియా బాధ్యత అని తెలిపారు. ఇలా కాకుండా ప్రభుత్వ నిర్ణయాలను భూతద్దంలో చూపుతూ.. ఇవి ప్రజలకు నష్టమన్నట్టు ప్రచారం చేయడం సరికాదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని.. ఇతరుల హక్కులు, స్వేచ్ఛ, ప్రాణాలను హరించకూడదని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ఆవశ్యకత, ఇందులోని అంశాలపై విద్యావేత్తలు, మేధావులు సమాజానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా స్పందించాలని కోరారు. మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో బుధవారం జీవో నంబర్ 1పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే.. రాజకీయ కోణంలో చూడకూడదు.. సామాన్యుల ప్రాణాలు పరిరక్షించేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను రాజకీయకోణంలో చూడటం సరికాదు. తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుంది? కందుకూరు, గుంటూరు ఘటనలపై పౌరహక్కులు, దళిత సంఘాలు కూడా స్పందించకపోవడం విచారకరం. ఇదే ఘటన అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో జరిగితే అక్కడ సమాజమంతా గొంతెత్తేది. మరణించిన వారికి కనీసం సంతాప సభ కూడా నిర్వహించకపోవడం హర్షణీయమా? కనీసం భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగనీయబోమని ప్రకటించకుండా యధావిధిగా సభలు, సమావేశాలు నిర్వహించడం సరైన పనేనా? ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంపై మేధావులు సమాజానికి అవగాహన కల్పించాలి. –ఆచార్య పి.రాజశేఖర్, వీసీ, ఏఎన్‌యూ మరిన్ని సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం.. సమాజానికి ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ ఉత్తర్వులపై సమాజానికి అవగాహన కల్పించడం విద్యావేత్తలు, మేధావుల బాధ్యత. ప్రభుత్వ ఉత్తర్వులపై మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరిన్ని సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం. –ఆచార్య శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్, ఆర్కిటెక్చర్ కళాశాల, ఏఎన్‌యూ ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయని గుర్తించాలి.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆసక్తి ఉన్నవారు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. కానీ ఆ నిర్ణయమే తప్పంటే ఎలా? ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయనేది గుర్తించాలి. –ఆచార్య బి.కరుణ, రిజిస్ట్రార్, ఏఎన్‌యూ ప్రభుత్వ చర్యను అందరూ హర్షించాలి.. సమాజంలోని పౌరులందరి హక్కులు, స్వేచ్ఛ కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను అందరూ హర్షించాలి. – ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రెక్టార్, ఏఎన్‌యూ ఎవరికీ ఇబ్బంది లేనిచోట నిర్వహించుకోవాలి.. ఎవరికీ ఇబ్బంది లేనిచోట బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలి. అసలు సమావేశాలే నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేస్తే ఇబ్బంది కానీ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా జరుపుకోండంటే తప్పెలా అవుతుంది? – ఆచార్య కె.సునీత, ఓఎస్డీ, ఏఎన్‌యూ ఈ జీవోతో ఇబ్బందులేమీ లేవు.. జీవో నంబర్ 1తో ఇబ్బందులేమీ లేవు. దీనిలోని వాస్తవాలను అందరూ గ్రహించాలి. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడే చర్యలను ఎవరు చేపట్టినా హర్షించాలి. –ఆచార్య కె.మధుబాబు, డీన్, సీడీసీ, ఏఎన్‌యూ -
ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా?
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి బొడ్డున ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు అనే దళిత యువకుని దారుణ హత్య... మనం ఎటువంటి సమాజంలో జీవిస్తున్నామో స్పష్టం చేస్తున్నది. హైదరాబాద్‌కు చెందిన అస్రీన్ సుల్తానా అనే యువతి, వికారాబాద్‌కు చెందిన నాగరాజు ప్రేమించుకొని మూడు నెలల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. దీన్ని సహించలేకపోయిన సుల్తానా సోదరుడు, అతడి స్నేహితులు హైదరాబాద్‌లో నాగరాజుపై దాడి చేసి, హత్య చేశారు. నాగరాజుపై పదిహేను నిముషాల పాటు వరుసగా రాడ్లతో దాడి చేసారనీ... జనం చూస్తూ వీడియోలు తీస్తున్నారు తప్ప ఆపేందుకు ప్రయత్నించలేదనీ, తాను ఎంత వేడుకున్నా ఎవరూ ముందుకొచ్చి సాయపడలేదనీ, వాళ్ళను వేడుకొంటూ తాను సమ యాన్ని వృథా చేసాననీ సుల్తానా మీడియా ముందు వాపోయింది. గతంలోనే తన సోదరుడు ఈ పెళ్ళి చేసు కోవద్దని తనను బాగా కొట్టాడనీ, ఉరివేసి చంపడానికి ప్రయత్నించాడనీ, తనను ఉరి వేసుకుని చనిపొమ్మని ఆదేశించాడనీ కూడా తెలిపింది. గతంలో రెండుసార్లు తాము పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తమకు ప్రాణహాని ఉందనీ, రక్షణ కలిగించాలనీ విజ్ఞప్తి చేసినట్లుగా కూడా ఆమె తెలియజేసింది. ఇక్కడ అనేక విషయాలు మనల్ని ఆలోచింప జేస్తున్నాయి. మన వ్యవస్థలన్నీ ఇంత నిర్వీర్యం అయిపోయాయా? మనం ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా? వీటిని నిరోధించే అవకాశమే లేదా? మనలో కూడా తెలిసిగానీ తెలియకుండా గానీ ఇలాంటి అమానుషత్వం దాగి ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకా ఈ అంశం ఇవ్వాళ ఎన్నో రకాల చర్చలకు, సమాలోచనలకు కేంద్రంగా నిలిచింది. సాధారణంగానే దళిత సంఘాలు ముస్లిం సంఘాల మీద కోపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముస్లింలపై హిందూత్వ శక్తులు దాడులు చేసిన ఎన్నో సందర్భాలలో ఆ బాధ తెలిసిన దళితులుగా తాము ముస్లింలకు మద్ధతుగా నిలిచామనీ, ఇప్పుడు ముస్లింల చేతిలో దళిత యువకుడు హత్యకు గురికావడం తట్టు కోలేనిదిగా ఉందనీ అభిప్రాయాలు వచ్చాయి. పలు ముస్లిం సంఘాలు కూడా తమకు దళితులపై గౌరవం ఉందనీ, ఈ హత్యను ఖండిస్తున్నామనీ, నిందితులను కఠినంగా శిక్షించాలనీ ప్రకటనలు చేశాయి. ఈ హత్యను వ్యక్తిగతంగానే చూడాలనీ, ఇది రాజకీయమైనది కాదనీ కొందర న్నారు. (ఆ హత్యను ఖండిస్తున్నాం) పైకి ఇది పరువు హత్యగా కనిపిస్తుంది. కానీ దీని వెనక సమాజంలో వేళ్ళూనుకు పోయి ఉన్న మౌఢ్యాల చరిత్ర, కొత్త తరాలకు సరైన విలువలు, ఆదర్శాల్ని ఇవ్వలేకపోతున్న ఆధునికతా వైఫల్యాలు దాగి ఉన్నాయి. – జి. కళావతి ‘అధ్యాపక జ్వాల’ సహాయ సంపాదకులు -
ప్రజలంటే గౌరవం లేదు
సాక్షి, హైదరాబాద్: ‘సామాన్య ప్రజలంటే ఏ మాత్రం గౌరవం లేదు. వారితో అగౌరవంగా వ్యవ హరిస్తుంటారు. ఉద్యోగులు తమ పనికి సంబంధిం చిన విషయ పరిజ్ఞానాన్ని కలిగి లేకపోవడంతో సత్ఫలితాలు రావట్లేదు. బాధ్యతలను ఇతరులపై నెట్టేస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్ణయాలు తీసుకునే సమర్థత కొరవడింది. క్షేత్ర స్థాయిలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది’ ఇవీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహార తీరుపై తెలంగాణ తొలి వేతన సవరణ సంఘానికి (పీఆర్సీ) పౌర సమాజం నుంచి అందిన ఫిర్యా దులు. ఉద్యోగులపై పౌరుల ఫిర్యాదులు, వీటిపై ఉద్యోగ సంఘాల వివరణలు, వీటి పరిష్కారానికి తీసుకోవాల్సిన సంస్కరణలను వేతన సవరణ కమిషన్ తన నివేదికలో ‘హ్యూమన్ రిసోర్సెస్’ పేరుతో ఓ అంశంగా పొందుపర్చింది. ‘ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి తమ వ్యవహార శైలితో వారి సమస్యలను పెంచుతున్నారు. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ ఆశించిన రీతిలో పని చేయట్లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు’అని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ప్రజల నుంచి ఫిర్యాదులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ పని తీరుపై సంతృప్తి కలిగించేందుకు.. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, సమర్థత, ఫలితాలతో జీతాల పెంపును ముడిపెట్టాలని పౌరుల నుంచి సూచనలు వచ్చినట్లు కమిషన్ ప్రస్తావించింది. పని ఒత్తిడి వల్లే.. ‘ప్రభుత్వ శాఖల్లో పని భారం పెరిగినా ప్రస్తుత సిబ్బందితోనే నెట్టుకురావాల్సి వస్తుండటంతో ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలను సమ ర్థంగా అందించలేకపోతున్నాం. అన్ని శాఖల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉండటం, పెరిగిన పనిభారం వల్లే ఇలా జరుగుతోంది. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ స్థాయి నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేసే అధి కారులు, సిబ్బందికి వాహనాలు కేటాయించలేదు. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కాలేకపోతున్నారు. ప్రభుత్వం వీరికి వాహనాలు కేటాయించాలి. లేదంటే సొంత వాహనాలు వాడితే ఫిక్స్డ్ ట్రావెల్ అలవెన్సులు ఇవ్వాలి. కార్మిక శాఖ వంటి కొన్ని శాఖల్లో క్షేత్ర స్థాయి సిబ్బందికి వాహనాలు అందించడంతో ప్రభుత్వ ఆదాయం పెరిగింది’అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పీఆర్సీ కమిషన్ కు వివరణ ఇచ్చారు. ఈ శాఖల్లో మరింత సమస్యలు.. ఉద్యోగుల పనితీరుపై ప్రజల నుంచి వ్యక్తమైన ఆందోళనలు ప్రభుత్వ శాఖల పట్ల ఉండే సర్వ సాధారణ అభిప్రాయమని, ప్రజలకు అత్యధికంగా రెవెన్యూ, హోం, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల పనితీరు వల్ల ఇబ్బందులు కలుగుతున్నా యని పీఆర్సీ కమిషన్ వ్యాఖ్యానిం చింది. ఐటీ, కంప్యూటర్ పరిజ్ఞానం లేక ప్రజలకు సరైన సేవలందట్లేదని, 3, 4వ గ్రేడ్ ఉద్యోగులకు ఎలాంటి శిక్షణ లేదని పేర్కొంది. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కమిషన్ సూచించింది. సంస్థాగత సామర్థ్యంతో పాటు ఉద్యోగుల సాధి కారతను పెంపొందించడానికి చర్యలు తీసుకోవా లని ప్రభుత్వాన్ని కోరింది. మల్టీ టాస్కింగ్ స్కిల్స్ తో పాటు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవ డం, సమస్యలను పరిష్కరించే వ్యవహార శైలి, నిర్ణయాలు తీసుకునే సమర్థతను ఉద్యోగులకు కల్పించేందుకు క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఉద్యోగుల పని తీరును మెరుగు పర్చడానికి పీఆర్సీ–2014 చేసిన సిఫారుసుల్లోని కొన్నింటిని మరోసారి సిఫారసు చేస్తున్నట్లు తన నివేదికలో పొందుపర్చింది. టీఎస్పీఎస్సీ/డీఎస్సీ/ఇతర నియామక సంస్థల ద్వారా జరిపే ఉద్యోగ నియామకాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాలకు సంబంధించిన హెచ్ఆర్ ప్లాన్‌ను ప్రభుత్వం కలిగి ఉండాలి. అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు ఉండాలి. ఉద్యోగ జీవితంలో కనీసం రెండు పదోన్నతులు వచ్చేలా సర్వీస్ రూల్స్‌ను సమీక్షించాలి. క్షేత్ర స్థాయిలో పనిచేసే గ్రూప్–1, 2 అధికారులు, సహాయ సిబ్బందికి రవాణా సదుపాయం, టీఏ సదుపాయం కల్పించాలి. సేవలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలి. క్షేత్ర స్థాయిలో సేవలందించే సిబ్బందికి మొబైల్ ఫోన్ , సీయూజీ సదుపాయం కల్పించాలి. గ్రూప్–1, 2 అధికారులకు ల్యాప్‌టాప్/ నోట్‌బుక్‌లను ఇంటర్నెట్తో పాటు అందించాలి. మీ–సేవ పరిధిలో ప్రభుత్వ శాఖలు తమ సేవలను తీసుకురావాలి. -
పౌర సమాజమా... పారాహుషార్!
‘గుండె బాగుండాలి’ అనే శీర్షికతో సుప్రసిద్ధ ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు ఇటీవల ఒక వ్యాసం రాశారు. అది సాక్షి ఈ–పేపర్ అనుబంధంలో శుక్రవారం నాడు అచ్చయింది. సంస్కృతిని ఒక సమాజపు గుండెకాయతో ఆయన పోల్చారు. దేహంలోని ఇతర భాగాలకు గాయాలైతే నయం చేసుకోవచ్చు. గుండెకు గాయమైతే ప్రాణాపాయం. అదేవిధంగా ఒక సమాజం నిర్మించుకున్న సంస్కృతి–దాని విలువలు ధ్వంసమైపోతే ఆ సమాజపు కీర్తిప్రతిష్టలు నశించిపోతాయని ఆయన అభిప్రాయ పడ్డారు. జగద్విఖ్యాతులైన కొందరు తత్వవేత్తల అభిప్రాయా లకు దగ్గరగానూ, ప్రస్తుత పరిణామాలపై హెచ్చరికగానూ చాగంటివారి అభివ్యక్తిని పరిగణించవచ్చు. అసలు సంస్కృతి అంటే ఏమిటి? అదెలా నిర్మితమవుతుంది?. సంగీతమూ, నాట్యమూ, చిత్రలేఖనమూ, శిల్పమూ వగైరా కళారూపాలన్నీ ఏ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తాయో, ఆయా కళారూపాలను సృజిం చిన కళాకారులు ఏ సందేశాన్ని ఈ సమాజానికి ఇవ్వాలను కుంటున్నారో వాటి సమాహారమే సంస్కృతి అంటారు చాగంటి. వ్యవస్థలో పౌర సమాజాన్ని మూడో కార్యక్షేత్రంగా (థర్డ్ డొమెయిన్) హెగెల్, కార్ల్ మార్క్స్ వంటి దార్శనికులు నిర్ధారిం చారు. మిగతా రెండు కార్యక్షేత్రాల్లో ఒకటి ఉత్పత్తి సంబంధా లతో కూడిన ఆర్థిక రంగమైతే, రెండవది రాజకీయ రంగం. పౌర సమాజంలో వేర్వేరు భాగాలుగా ఉండే కుటుంబం, కులం, మతం లేదా కార్మికులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ రకాల ఆలోచనారీతులు, భావజాలాలు, కళలు– సాహిత్యం, వ్యక్తిగత–సమష్టి జీవనం, వీటన్నింటి ద్వారా ప్రసరించే ఒక ప్రాపంచిక దృక్పథమే సంస్కృతని ఇటాలియన్ మార్క్సిస్టు తత్వవేత్త గ్రామ్సీ నిర్వచించారు. అయితే దేశ–కాల పరిస్థితులను బట్టి అక్కడ ఆధిపత్య భావజాలం ఆ సంస్కృతిని ప్రభావితం చేస్తుందని కూడా గ్రామ్సీ అభిప్రాయపడ్డారు. శాస్త్రవిజ్ఞాన రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేసిన సర్ ఐజాక్ న్యూటన్ ఒక గొప్ప మాటన్నాడు. "If I have seen further, it is by standing on the shoulders of giants ’’. దాని తాత్పర్యం.. ‘‘ఇవాళ నేను కొత్త దూరతీరాలను దర్శించ గలుగుతున్నానంటే, మహామహుల భుజాలపై నేను నిలబడి ఉండటమే అందుక్కారణం’’. అప్పటికే ఎంతోమంది తత్వ వేత్తలు, శాస్త్రవేత్తలు శ్రమించి, శోధించి ప్రోదిచేసిన విజ్ఞాన భూమిక ఆసరాతోనే మనం కొత్త విజయాలను సాధించగలుగు తున్నామని ఆయన భావన. ఈరోజున మన పౌర సమాజం రూపొందించుకున్న సంస్కృతీ–విలువలు, దిద్దుకున్న ప్రాపం చిక దృక్పథం, ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ.. ఇవన్నీ కూడా వేనవేల సంవత్సరాల పాటు మానవ జాతి నిరంతరం సంఘర్షించీ, సంశోధించీ, స్వప్నించీ, తపించీ చేరుకున్న మజిలీల్లోని ఉన్నతస్థాయి రూపాలు. ‘భూగోళం పుట్టుకకోసం రాలిన సురగోళాలెన్నో... ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో...’ అన్నారు మహాకవి దాశరథి. ఈ మానవరూపం సంప్రాప్తించిన తర్వాత సంస్కృతీ– విలు వలతో కూడిన నాగరిక సమాజం రూపొందడానికి కూడా జరి గిన పరిణామాలెన్నో. చెలరేగిన యుద్ధాలకూ, తెగిపడిన శిర స్సులకూ, ప్రవహించిన నెత్తురుకూ లెక్కలు లేవు. దురా క్రమించి చెరబట్టే అలెగ్జాండర్లనూ, చెంఘిస్ఖాన్లను చరిత్ర మోసింది. బానిస సంకెళ్లను తెంచడానికి స్పార్టకస్‌లూ, చేగు వేరాలూ చరిత్రలో మొలకెత్తారు. మూడు ఖండాలను ఏలిన రోమ్ సామ్రాజ్యం పతనమైంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించింది. హిట్లర్, ముస్సోలినీలు ఓడి పోయారు. గాంధీలు, మండేలాలు గెలిచారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థది పైచేయి అయింది. అందులో భారత్ అత్యున్నత స్థానాన్ని అధిష్టించింది. భారతీయ సంస్కృతిని ‘గంగా–యమునా తెహజీబ్’ అంటారు. అంతటి సహజమైన సంగమ, సమ్మిళిత సంస్కృతి ఈ దేశానిది. ఈ సంస్కృతికి వెయ్యేళ్ల కథ ఉన్నది. ఈ కథలో తులసీదాస్ ఉన్నాడు, కబీర్దాస్ ఉన్నాడు, గురునానక్ ఉన్నాడు. స్వామి వివేకానంద, మదర్ థెరిసా, అబ్దుల్ కలామ్ ఆధునిక భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లు. గంగా–యమునా తెహజీబ్ ఫిలాసఫీని భారత రాజ్యాంగంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేర్చారు. ఆరాధనా స్వేచ్ఛ మన ప్రాథమిక హక్కు. విశ్వాసాల ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపడాన్ని రాజ్యాంగం అంగీకరించదు. భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి దక్షిణ భారతదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరింత పటిష్టంగా ఉన్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదగిరి అనే పేరు ఎంతమందికి ఉంటుందో సైదులు అనే పేరు కూడా అంతమందికి ఉంటుంది. నెల్లూరు జిల్లాలో రమణారెడ్డి పేరుతో ఎంతమంది ఉంటారో మస్తాన్‌రెడ్డి పేరుతో కూడా అంతమంది ఉంటారు. తెలుగు ప్రజలకు తిరుపతి తర్వాత నంబర్ టూ పుణ్యక్షేత్రం షిర్డీ. విజయవాడలో కనక దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఎంత కోలాహలంగా ఉంటాయో, మేరీమాత ఉత్సవాలు కూడా అంతే సందడిగా ఉంటాయి. కడివెడు పాలలో విషం చుక్క కలిపినట్టు గంగా–యమునా తెహజీబ్ సంస్కృతిని కలుషితం చేయడానికి సాక్షాత్తు ఒక సీని యర్మోస్ట్ రాజకీయ నాయకుడు ఇప్పుడు కంకణం కట్టుకున్న వైనం చూసి తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ మహానాయకుడికి దళితులంటే గిట్టదు. ఆ సంగతి ఆయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. దళితులకు చదువు అబ్బదు అనేది ఆ పార్టీ ఫిలాసఫీ. బీసీలకు తెలివితేటలుండవు కనుక, వాళ్లు జడ్జీలుగా పనికిరారని ఆయన నిశ్చితాభిప్రాయం. ఈమేరకు కేంద్ర న్యాయశాఖకు ఆయన ఉత్తరం కూడా రాశాడు. గిరిజన జాతుల ప్రజలు మంత్రులుగా పనికిరారనే అభిప్రాయం కూడా. ఆయన ఐదేళ్ల కాలంలో చివరి నాలుగు నెలలు మాత్రమే అదీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక గిరిజనుడికి మంత్రి అవకాశం కల్పించారు. ఇప్పుడు క్రైస్తవులు, ముస్లిములు, బౌద్ధులు మొద లైన మైనారిటీ మతస్తులు ముఖ్యమంత్రులుగా వుండకూడదని చాటింపు వేస్తున్నారు. ‘ముఖ్యమంత్రి క్రైస్తవుడు, జెరూసలేం వెళ్తాడు, నేను హిందువును తిరుపతికి వెళ్తాను’ అని ఆయన చేసిన బహిరంగ ప్రకటనను పిండితే వచ్చే అర్థం అదే. ఈ ప్రక టన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. ఈ వ్యాఖ్యలలో ఆయన ప్రజాస్వామ్యం మీదనే కాదు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మీద కూడా తీవ్రమైన దాడికి పాల్పడ్డాడు. అమెరికా చట్టసభల భవనం మీద ట్రంప్ అనుయాయులు చేసిన దాడి కంటే ఇది తీవ్రమైనది. ఆ దాడి బయటకు కనిపించే గాయాన్ని చేసింది. ఈ దాడి మన పౌరసమాజం గుండెకు గాయాన్ని చేసింది. గడిచిన వారం ప్రజాస్వామ్య వ్యవస్థలకు చేటుకాలం. ఈ రెండు ఘటనల వెన్నంటే ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈయన వ్యవహారం హరిశ్చంద్ర నాటకంలో నక్షత్ర కుని పాత్రను గుర్తు చేస్తున్నది. తన యజమాని విశ్వామిత్రుని సంతృప్తిపరచడం కోసం నక్షత్రకుడు ఎంత అతిగా వ్యవహరిం చాడో, తనకీ పదవిని కల్పించిన నాయకుడిని సంతృప్తిపరచడం కోసం ఈ వ్యక్తి అంతకంటే ఎక్కువ అతిగా వ్యవహరించడం జనం దృష్టిలో పడింది. ఎన్నికల కోడ్ సాకుతో పేదల ఇళ్లస్థలాల పంపిణీని అడ్డుకోవడం, 45 లక్షలమంది మహిళలకు ఉపయోగ పడే అమ్మఒడి పథకాన్ని అడ్డుకోవడం ద్వారా తమ ‘నాయకుని’ మెప్పుపొందడం కోసమే ఈ అకాల షెడ్యూల్‌ను ప్రకటించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదవర్గాల అభ్యున్నతి అంటే ఏమాత్రం సహించలేని ఈ నాయకునికి వెన్నుదన్నుగా వున్న కోస్తా సంపన్నవర్గాల విజయ యాత్ర ఎప్పుడు ప్రారంభమైందో ఒకసారి గుర్తుకు చేసుకుం దాము. ఆరేడు దశాబ్దాలకు పూర్వం ఈ వర్గాల్లోని పెద్ద రైతులు వ్యవసాయంలో భారీగా లాభాలు తీయడం ప్రారంభించారు. ట్రాక్టర్లు, యంత్ర పరికరాలేవీ ప్రవేశించని ఆ రోజుల్లో ఏసయ్యలూ–సుబ్బయ్యలూ కండలు కరిగించిన ఫలితంగా, ఎలీశమ్మలూ–సుశీలమ్మలూ చెమటలు ధారపోసిన కారణంగా బంగారు పంటలు పండి లాభార్జన సాధ్యమైంది. ఆ లాభాలతో వారు వ్యాపార సామ్రాజ్యంలోకి ప్రవేశించారు. సినిమా పరిశ్రమను ఆక్రమించారు. మీడియా ప్రపంచాన్ని హస్తగతం చేసుకోగలిగారు. ఇప్పుడీ మీడియా–వ్యాపార సామ్రాజ్యాల అండదండలతోనే వారి నాయకుడు పేదవర్గాలపై యుద్ధం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో ఆ పార్టీ సిద్ధాంతాన్ని ఎన్టీ రామారావు ఒక్క వాక్యంలో ప్రకటిం చారు. ‘‘సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్లు’. ఇదే తన ఎజెండా అని ఆయన ప్రకటించుకున్నారు. ‘మానవసేవయే మాధవసేవ’ అన్నాడు వివేకానందస్వామి. దేవుడు ఎక్కడో లేడు నీ ఎదురుగా ఆకలితో అల్లాడుతున్న పేదవాడిలోనే ఉన్నాడు. అతడికి సాయపడు అన్నాడు. పేదవాడిలో సాక్షాత్తు నారాయణ స్వరూపాన్ని వివేకానందుడు చూశాడు. చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో అద్భుతమైన ప్రసంగం చేస్తూ ‘నా దేశం సకల మతాలకు నిలయమ’ని సగర్వంగా ప్రకటించు కున్నాడు. ‘నా దేశం పరమత సహనాన్ని ప్రపంచానికి బోధిం చిన దేశం. అన్ని మతాలూ సత్యమైనవే. అన్ని మతాలూ నిత్యమైనవే అని నమ్మే దేశం నాది’ అని వివేకానందుడు ప్రక టించాడు. వివేకానందుని బోధనలా? లేక కొందరు కొత్త బిచ్చ గాళ్లు ఒంటినిండా దిద్దుకుంటున్న నామాలా?... ఏవి హిందుత్వ ప్రతీకలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదేమిటి? వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు విప్లవాత్మకమైనవి కావా? దారిద్య్రంలో ఉన్న ప్రజలకు ఆత్మగౌరవ జీవితాన్ని ప్రసాదించ డానికి ప్రయత్నించడం పేదవాడిలో నారాయణ స్వరూపాన్ని దర్శించడం కాదా? నిలువ నీడలేని పేద కుటుంబానికి సొంత ఇల్లు కట్టించి ఇవ్వడం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను ప్రతిబిడ్డకు జన్మ హక్కుగా అమలుచేయాలనుకోవడం, నాణ్య మైన వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందుబాటులోకి తేవడం, ప్రతి రైతూ, ప్రతి కూలీ, ప్రతి పేదా ఉన్నత జీవనాన్ని అందు కునేందుకు ఆలంబనగా నిలబడాలనుకోవడం మానవ సేవ కిందకు రావా? మానవసేవే మాధవ సేవ అన్నారు మహా త్ములు. వివేకానందుడు చెప్పిన హిందూత్వ స్ఫూర్తి కూడా అదే. మానవ సేవనే మేనిఫెస్టోగా అమలు చేస్తున్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆ మానవసేవా కార్యక్రమాలను అడ్డుకుంటున్నది ప్రతిపక్ష నేత. ఇప్పుడు హిందువులకు బంధువులెవరో, హిందు వుల పాలిట రాబందువులెవరో స్పష్టంగా కనిపించడం లేదా! కేవలం ఒక వ్యక్తి, ఆయన తైనాతీలు తమ స్వార్థంకోసం, మన జాతి వందలయేళ్ల కాలగమనంలో నిర్మించుకున్న సంస్కృతిని విలువలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర పౌరసమాజం అప్రమత్తంగా ఉండవలసిన తరుణం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చంద్రబాబు అరాచకాల వల్లే ఓటమి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అనుసరించిన అప్రజాస్వామిక, అరాచక విధానాలు, అవినీతి, అప్పులు, ఆశ్రితపక్షపాతం, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలన్న ఆలోచనా ధోరణే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అఖండ విజయాన్ని సాధించి పెట్టిందని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పౌరసమాజం అభిప్రాయపడ్డాయి. వైఎస్ జగన్ శాసనసభలో అడుగుపెట్టినప్పటి నుంచి అడుగడుగునా ఆయన్ను అవమానించిన తీరే చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని, ఆ తీరే ఆయన ఓటమికి కారణమైందని పేర్కొన్నాయి. నూతన ప్రభుత్వానికి అప్పులు మిగిల్చిన వ్యవహారమై ప్రజలకు అన్ని వ్యవహారాలు తెలిసేలా శ్వేతపత్రాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర విభజన సందర్భంగా వచ్చిన రూ. 86 వేల కోట్ల అప్పు ఇప్పటికి రూ. 2.14 లక్షల కోట్లకు ఎందుకు చేరిందో వివరించాలని డిమాండ్ చేశాయి. ఏయే శాఖల్లో అప్పులు ఎందుకు తీసుకున్నారోనన్న అంశంపై కొత్త ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరాయి. ఏపీ ఫైబర్‌గ్రిడ్ సహా అన్ని శాఖల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపైనా విచారించాలని రాష్ట్ర మేధావుల సంఘం కోరింది. దానికి ముందే అప్పులపై శ్వేతపత్రాన్ని ప్రకటించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చేతనా సమాఖ్య కాబోయే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. -
నిరాశ్రయులపై నిర్లక్ష్యమొద్దు
న్యూఢిల్లీ: ఇళ్లులేని పట్టణ నిరుపేదల పట్ల నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు కేంద్రానికి చురకలంటించింది. శీతాకాలం రాబోతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరికీ ఇళ్లు కనీస అవసరమని పేర్కొంది. పట్టణ నిరాశ్రయుల బాగోగులు చూసే పౌర కమిటీల సభ్యుల పేర్లను ఇంకా ప్రకటించని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై రూ.1–5 లక్షల మధ్య జరిమానా విధించింది. నిరుపేదలకు వసతి కల్పనపై కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ దాఖలుచేసిన పత్రాల్లోని వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 22నే తాము ఆదేశాలు జారీచేసినా ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పౌర కమిటీల సభ్యుల పేర్లను ప్రకటించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో విఫలమైన హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్, గోవా, మిజోరం, మేఘాలయ, ఒడిశా, త్రిపుర, చండీగఢ్లపై రూ.1 లక్ష చొప్పున, హరియాణాపై రూ.5 లక్షల జరిమానా విధించింది. వరదలతో దెబ్బతిన్న కేరళ, ఉత్తరాఖండ్‌లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. మూడు వారాల్లోగా జరిమానాను సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ వద్ద జమచేయాలని సూచించింది. ‘రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాలు అవసరమైన చర్యలు తీసుకునేంత వరకు జరిమానా విధించడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. శీతాకాలం రాబోతోంది. ఈ పరిస్థితుల్లో ఇళ్లు లేని నిరుపేదలను అలా వదిలేయకూడదు. గృహకల్పనపై కేంద్రం భారీ ప్రణాళికలు రూపొందించుకున్నా, అవి సరిగా అమలుకావడం లేదు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. పౌర కమిటీల సభ్యుల పేర్లను ప్రకటిస్తూ రెండు వారాల్లోగా నోటిఫికేషన్ జారీ చేయాలని జరిమానా విధించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. విపత్తు నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి విపత్తు నిర్వహణకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అధిక ప్రాధాన్యమివ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెబ్సైట్లో కేవలం 9 రాష్ట్రాలే తమ ప్రాంతీయ భాషల్లో ప్రణాళికలు, నివేదికలను పొందుపరిచాయని పేర్కొంది. ‘ కేరళలోని భారీ వరదలను ఎలా మరచిపోగలం. కానీ కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నాయి. విపత్తు ప్రణాళికల్ని అనువదించేందుకు ఇంత సమ యం ఎందుకు తీసుకుంటున్నాయి?’ అని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఎన్ఎస్ నాదకర్ణిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మూడు నెలల్లో అన్ని రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రణాళికల్ని అందుబాటులోకి తెస్తాయని నాదకర్ణి బదులిచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై స్టే ఇవ్వలేం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో పాత నిబంధనలు పునరుద్ధరిస్తూ పార్లమెంట్ చేసిన సవరణలపై స్టే విధించలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ సవరణలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆరువారాల్లోగా బదులివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. పార్లమెంట్ తన అధికార పరిధిని దాటి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల(వేధింపుల నిరోధక) చట్టంలో సవరణలు చేసిందని, వాటిని రద్దుచేయాలని పిటిషన్‌దారులు కోరారు. నిందితుల అరెస్ట్‌కు సంబంధించి కొన్ని రక్షణలు చేరుస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న చట్టంలో మార్పులు చేసింది. కోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ పాత నిబంధనలు పునరుద్ధరించే బిల్లును ఆగస్టు 9న పార్లమెంట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ చేసిన సవరణలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణకు చేపట్టింది. పిటిషన్ల తదుపరి విచారణ జరిగే వరకైనా, పార్లమెంట్ పునరుద్ధరించిన నిబంధనలపై స్టే విధించాలన్న పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది పృథ్విరాజ్ చౌహాన్ విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. ‘ స్టే ఎందుకు? పార్లమెంట్ ఆమోదం తెలపడం వల్ల ఇప్పుడవి చట్టబద్ధమయ్యాయి. లోపాలు సరిదిద్దకుండా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసిందన్న సంగతి మాకూ తెలుసు’ అని ధర్మాసనం తెలిపింది. ‘మూకహింస’ ఆదేశాలు పాటిస్తోంది 11 రాష్ట్రాలే మూక హింస, గోరక్షణ పేరిట జరుగుతున్న దాడుల కట్టడికి తాము జారీచేసిన ఆదేశాలకు కట్టుబడి ఉంటున్నామని కేవలం 11 రాష్ట్రాలే నివేదికలు సమర్పించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదికలిచ్చేందుకు వారం రోజుల గడువిచ్చింది. ఇందులోనూ విఫలమైతే సంబంధిత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. జూలై 20న రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఓ పాడిరైతును కొందరు కొట్టి చంపిన ఉదంతంలో అధికారులు కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని, వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. వారంలోగా నివేదిక సమర్పించాలనిరాజస్తాన్ను ఆదేశించింది. -
ప్రమాదంలో పౌర సమాజం
రెండో మాట మానవ హక్కుల పరిరక్షణా కార్యకర్తలుగా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రంగంలోకి దిగారు. వారిని హతమార్చడం ద్వారా పౌర సమాజం నోరు మూయించారు. అనుకున్న స్థాయిలో ఎదగకుండా, సివిల్ సొసైటీ తేజస్సు కోల్పోయి నిస్తేజ స్థితికి చేరుకోవడం వీటి ఫలితమే. ఇంతకుముందెన్నడూ లేనంతగా పాలక శక్తులు పౌర జీవనంలోని ప్రతి కోణంలోనూ– ప్రజల ఆహార అలవాట్లలో, మత విశ్వాసాలలో, వస్త్రధారణలో జోక్యం చేసుకునే విధానానికి తెరలేపి, సెక్యులర్ వ్యవస్థ మౌలిక ప్రయోజనాలనే దెబ్బతీస్తున్నాయని గ్రహించాలి. ‘ప్రజలను నిరంకుశ పాలకులు మూకకొలువుకు అలవాటు చేస్తారు. ప్రజలు తమను కిమ్మనకుండా అనుసరిస్తున్నారుగదా అని, తమ అధికారానికి ఇక ఢోకా ఉండదన్న నమ్మకంతో ఆ గుడ్డి విధేయతను తాము ఖుషీగా పొందగలమన్న నిరంకుశ పాలకులు విశ్వాసం ఇకముందు ప్రజాస్వామ్య సంస్థలనూ, ప్రజాస్వామిక సంప్రదాయాలనూ కుమ్మరిపురుగుల్లా తొలిచి వేయడం ఖాయం. ఫలితంగా పౌర స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకూ, మానవ హక్కులకూ, వాటి పరిరక్షణకూ భయంకరమైన హాని జరుగుతుంది.’ – జి. సంపత్ (ప్రసిద్ధ పత్రికా విశ్లేషకులు, విమర్శకులు; ‘ది హిందూ’, డిసెంబర్ 4, 2016) ‘మన ఓటర్లయితే నాయకులని ఎన్నుకుంటారేగానీ ఆచరణలో అసలైన అ«ధికారం దేశపౌరుల చేతుల్లో లేదు.’ – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశంలో ఎదుగుతున్న పౌర సమాజాన్ని క్రమంగా నిర్వీర్యం చేసే ఎత్తుగడలూ, వ్యూహాలూ శరవేగంగా అమలులోకి వస్తున్నాయన్న గుర్తింపు నేటి అవసరం. ప్రజా బాహుళ్యానికి చెందిన సర్వ విభాగాలను ఈ స్పృహ ఆవరించవలసిన సమయమిది. అసలు పౌర సమాజం నిరంతరం జాగరూకమై ఉండవలసిన అవసరం ఎంతటిదో 84 ఏళ్లకు ముందే, జి. సంపత్ చెప్పడానికి ఎంతో ముందే– హెచ్చరికగా డాక్టర్ అంబేడ్కర్ అత్యంత విలువైన సందేశం ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధానుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన సందేశమిది: ‘భారత ప్రజలకూ, దేశానికీ నాజీ హిట్లర్ (జర్మనీ)జాతి, వర్ణ వివక్షా సిద్ధాంతం, దాని భావజాలం కూడా మన దేశ ప్రజల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు ప్రత్యక్షంగా ఎదురయ్యే సవాళ్లే. నాజీయిజాన్ని ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనడానికి భారతీయులు సదా అప్రమత్తులై ఉండాలి’(అంబేడ్కర్ స్పీక్స్. సంపుటం –2, సం. ప్రొ. నరేంద్ర జాధవ్, 2013). పౌర సమాజం ప్రాధాన్యం మనది ఇంకా రాజ్యాంగం నిర్వచించి, ప్రతిపాదించిన రిపబ్లికన్ (పూర్తి జనతంత్ర) వ్యవస్థ కాకపోవచ్చు. ఉన్నంతలోనే ఎన్నికల ప్రకారం ఏర్పడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలైనా సక్రమంగా విజయవంతంగా పనిచేయాలంటే దేశంలో స్థిరమైన పౌర సమాజం ఒక అంకుశం మాదిరిగా నిరంతరం పనిచేయవలసి ఉంది. కానీ ఇప్పటికే ఏర్పడి, కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న పౌర సమాజ వ్యవస్థ (సివిల్ సొసైటీ) కార్యకలాపాలు, అటు ప్రభుత్వానికీ, ఇటు దేశ పౌరులకూ దిక్సూచిగా పనిచేయడానికి వీలైన వాతావరణం ప్రస్తుత పాలనా వ్యవస్థలో మృగ్యమైపోతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం, పౌర హక్కుల రక్షణ కోసం రాజ్యాంగం లిఖితపూర్వకంగా హామీ పడింది. అయితే వాక్, సభా స్వాతంత్య్రాలకు భంగం కలిగించే రీతిలో బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న నాయకుల నోటి నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ ధోరణిని నాయకులు ఆచరణలోనూ ప్రదర్శిస్తున్నారు. ఈ ధోరణులకు ముగుదాడు వేయవలసినదే పౌర సమాజ వ్యవస్థ. అధికార, అనధికార, పాలక, ప్రతిపక్షాల నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారు పారదర్శకంగా, జవాబుదారీతనంతో నడుచుకునే విధంగా చేయడంలో కూడా పౌర సమాజ వ్యవస్థదే కీలకపాత్ర. ఈ కృషిలో పౌర సమాజంలోని సంఘాలు, సంస్థలు, మానవ హక్కుల పరిరక్షణా సంస్థలు, పత్రికలు, వృత్తిదారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు భాగస్వాములవుతారు. పాలనా వ్యవస్థకూ, ప్రజా ప్రయోజనాల రక్షణకూ మధ్య అంతరాన్ని తగ్గించే యత్నం చేస్తారు. నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాల మనుగడ అవసరాన్ని నొక్కి చెబుతూనే, పాలక వర్గాలు నిరంకుశ విధానాల వైపు మళ్లినప్పుడల్లా పెడమార్గం పట్టిన ప్రజా ప్రతినిధులను వెనక్కి పిలిపించేందుకు (రీకాల్) ప్రజలకు ఉన్న హక్కును రక్షించడం కూడా పౌర సమాజపు లక్ష్యమే. ఇలాంటి పంథాలోనే వివిధ ఖండాలలోని పౌర సమాజాలన్నీ పనిచేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే–రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిన మానవ హక్కులు, పని హక్కు, జీవించే హక్కు వంటి వాటి విషయంలో ప్రభుత్వాలు ఉల్లంఘనలకు పాల్పడకుండా చూసే వ్యవస్థ పౌర సమాజం. బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలకు వెన్నుదన్నుగా నిలవడం, దగాపడిన పౌరులకు అండగా ఉండడం; వీరి హక్కులను కాపాడడం కూడా పౌర సమాజం లక్ష్యంగా ఉంటుంది. బాధ్యత మరింత పెరిగింది కానీ నేటి ప్రజా వ్యతిరేక, దేశ విదేశీ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా రాజ్యాంగం నిర్వచించిన ఆర్థిక సమానత్వ స్థాపనకు లక్ష్యానికీ; జాతి, మత, కుల, వర్గ వివక్ష లేని సమాజ స్థాపనకూ విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాలక వ్యవస్థకు కళ్లాలు వేయవలసిన అవసరం నేటికీ మిగిలే ఉంది. కానీ ఇలాంటి కోర్కెలను సివిల్ సొసైటీ ప్రతిబింబించి, ప్రజలలో చైతన్యం తీసుకు రాకుండా సివిల్ సొసైటీ నేడు వివిధ స్థాయిల్లో అదిరింపులు, బెదిరింపులు ఎదుర్కొంటోంది. దేశం నలుమూలల్లో ప్రభుత్వ స్థాయిలో రహస్యంగా డజన్లకొద్దీ సామాజిక కార్యకర్తలను, మానవ హక్కుల పరిరక్షణా సంస్థల నాయకుల్ని, సివిల్ సొసైటీ కార్యకర్తల్నీ (డాక్టర్ పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గీ వగైరా) హతమార్చిన హంతకుల ఆచూకీ తెలియకుండా పాలక వర్గాలు జాగ్రత్తపడ్డాయి. అందుకు నిరసనగా వివిధ సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన డజన్ల కొలదీ జాతీయస్థాయి పురస్కార గ్రహీతలు తమ తమ ‘పద్మశ్రీ’బిరుద బీరాలను కాలిగోటికి సమానమని భావించి బీజేపీ–ఆరెస్సెస్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వాపస్ చేయవలసి వచ్చింది. యూనివర్సిటీలలో దళిత, మత మైనారిటీలకు చెందిన, సామాజిక చైతన్యంతో దీపిస్తున్న విద్యార్థి నాయకులపై భావ ప్రకటననే ‘దేశద్రోహ’నేరంగా ప్రకటించి వారి నోరు మూయించడానికి (రోహిత్, కన్హయ్య కుమార్ వగైరా) పాలకవర్గాలు కత్తులు దూశాయి. మానవ హక్కుల పరిరక్షణా కార్యకర్తలుగా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు రంగంలోకి దిగారు. వారిని హతమార్చడం ద్వారా పౌర సమాజం నోరు మూయించారు. అనుకున్న స్థాయిలో ఎదగకుండా, సివిల్ సొసైటీ తేజస్సు కోల్పోయి నిస్తేజ స్థితికి చేరుకోవడం వీటి ఫలితమే. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో పాలక శక్తులు పౌర జీవనంలోని ప్రతి కోణంలోనూ–ప్రజల ఆహార అలవాట్లలో, మత విశ్వాసాలలో, వస్త్రధారణలో జోక్యం చేసుకునే విధానానికి తెరలేపి, సెక్యులర్ వ్యవస్థ మౌలిక ప్రయోజనాలనే దెబ్బతీస్తున్నాయని గ్రహించాలి. ఈ విషయంలో స్వామి వివేకానంద, పండిత మదన్ మోహన్ మాలవీయ సమతుల్యమైన ధోరణి ప్రస్తుత పాలనా విధానాలకు విరుద్ధంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే, వర్ణ వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల మీద డాక్టర్ అంబేడ్కర్ సెంట్రల్ లెజిస్లేటివ్ స్టేట్ అసెంబ్లీలో (1951 సెప్టెంబర్ 20న) వేసిన ప్రశ్నల పరంపరకు పండిత మాలవీయ ఆర్యజాతి పుట్టుకను తవ్వుతూ ఇలా అంగీకరించాల్సి వచ్చింది: ‘‘ఆర్యులకు వర్గ విభజన అనే సాంఘిక వ్యవస్థ అంటూ ఒక లోపాయికారీ వ్యవస్థ ఏనాడూ లేదు. ఆ విభజన అనంతర కాలంలో పుట్టిన పుండు. ఈ సత్యాన్ని ఎవరూ కాదనలేరు’’ అన్నారు. తాడిత పీడిత వర్గాలు హైందవ సమాజపు వర్ణ వ్యవస్థలోని దోపిడీ పద్ధతుల నుంచి బయటపడ్డం కోసమే అన్య మతాలను ఆశ్రయించి, మతం మార్చుకునే ప్రయత్నాలు చేశారని స్వామి వివేకానంద (కంప్లీట్ వర్క్స్: సంపుటి 8) పాఠం చెప్పవలసి వచ్చింది. నిత్య జాగరూకతే కర్తవ్యం సమాజంలో ఇలాంటి చర్యలు ఎందువల్ల సంభవిస్తాయో, నాజీ హిట్లర్ జర్మనీలో వలే ప్రజల్ని మూక కొలువుకు బలవంతాన ఎలా అలవాటు చేయవచ్చునో నిరూపిస్తూ తన పరిశోధనాగారంలో సాక్షాత్తూ ప్రయోగాల ద్వారా స్టాన్లీమిల్ గ్రామ్ అనే సుప్రసిద్ధ అమెరికన్ మనస్తత్వ శాస్త్రవేత్త (1974) నిరూపించాడు. తన అనుభవాల సారాన్ని అతను ‘‘పాలకవర్గ అధికారానికి విధేయత’’అనే గ్రంథంలో (ఒబీడియన్స్ టు అథారిటీ) నిరూపించాడు. ఈ విషయాల్ని సమీక్షిస్తూ జి. సంపత్ ఎన్నో వివరాలు ఉదహరించారు. ‘జీ! హుజూర్’ మనస్తత్వాన్ని పౌరుల్లో ఎలా నూరిపోయవచ్చునో జర్మన్ల అనుభవం తర్వాత కొంతమంది అమాయకులపై ‘మూక కొలువు’ప్రయోగం ద్వారా మిల్గ్రామ్ జయప్రదంగా నిరూపించారని చెప్పాడు. దీనినే ‘గొర్రె దూకుడు’పద్ధతి అంటారు. తన ప్రయోగాల ద్వారా ప్రొఫెసర్ మిల్గ్రామ్ రూపొందించిన ఒక చలనచిత్రం పేరు ‘ప్రయోక్త’– ‘ఎక్స్పెరిమెంటల్ బయోపిక్’(2015). నిరంకుశ పాలనా వ్యవస్థలో పైకి కానరాని రహస్య పద్ధతులలో జర్మన్ జాతి రక్తమే పరిశుద్ధమైనదనీ, మిగతా మైనారిటీల జాతులన్నీ పరిశుద్ధం కానివన్న జాత్యహంకార సిద్ధాంతంపైనే యూదు మైనారిటీలను లక్షలాదిగా హిట్లర్ మూకలు విషవాయు ప్రయోగం ద్వారా హతమార్చడం చరి త్రలో చెరపరాని అత్యంత విషాదకర సన్నివేశం. అందుకే దేశంలోని పౌర సమాజానికి రానున్న ప్రమాద ఘంటికలు గురించి ముందస్తుగానే హెచ్చరికలు అందించారు కొందరు మేధావులు. మన దేశం రిపబ్లిక్ వ్యవస్థ (జనతంత్ర) కాకుండా కేవలం మాటల గారడీ ప్రజాస్వామ్య వ్యవస్థ (డెమోక్రసీ)గా మిగిలి పోవడంవల్ల ఏది మనదో, ఏది కాదో తేల్చుకోలేకుండా ఉన్నాం. చివరికి నేటి పాలనా వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందంటే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగరీత్యా సంక్రమించిన విశేషాధికారాలను కూడా (ఇందిరాగాంధీ (ఎమర్జెన్సీ) హయాం తరువాత) మింగేయడానికి ప్రయత్నిస్తోంది. కశ్మీర్లో శాంతి కోసం, ‘కూపీ’ సమాచారానికి ఆధారమైన ‘ఆధార్’ ప్రజలకు అందాల్సిన వస్తు సేవలకు కూడా విధిగా వర్తింపజేయాలన్న షరతును సుప్రీం కొట్టివేసినా, తన నిర్ణయం చుట్టూనే కేంద్రం చాంద్రాయణం చేస్తోంది. ఈ వరస చూస్తుంటే ఓ కవి వ్యంగ్య సాదృశ్యం జ్ఞాపకం వస్తోంది: ‘‘పెద్ద పులి ఆవుని చంపడం మానేసి పాలు తాగడం ప్రారంభించింది! ఇలాంటి అహింసా విజయం ఒక్క అమెరికాలోనే సాధ్యమని నమ్ముతుందట’’ఎందుకనట?/ ‘‘అమెరికాలో వర్గాల్లేవు. ఇండియాలో వర్ణాలు (కులాలు) ఉండవట! అంతమందీ ధనవంతులే! / ఆహా! ఎంత సుందర స్వప్నం! అయినా, ఈ ఊహ ఖరీదు ఎన్ని డాలర్లో!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పరిపాలన సుపరిపాలన
నాగరికత పరిణామ క్రమంలో ఏర్పడిన గొప్ప వ్యవస్థలో రాజ్యం ఒకటి. ప్రజలు, ప్రదేశం (భూభాగం), ప్రభుత్వం, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపుల సమాహారాన్ని రాజ్యంగా నిర్వచించవచ్చు. రాజ్యంలో పాలకులు, పాలితులు ఉంటారు. పాలకులు రాజ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. పాలితులు పౌర సమాజంలో కీలకపాత్ర పోషిస్తారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అనుసంధాన కర్తలుగా ఉంటారు. వీరు రాజ్య మౌలిక భావాలైన ప్రజా రక్షణ, సంక్షేమం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలను పర్యవేక్షిస్తారు. పాలనాపరమైన ఒత్తిళ్లు, పౌరుల డిమాండ్లు, అభివృద్ధి అసమానతలు, విశాల లక్ష్యాల కారణంగా ఆధునిక రాజ్యాలు గతంలో ఎప్పుడూ లేనంత సంక్లిష్టతను ఎదుర్కొంటున్నాయి. రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఉన్నత స్థాయిలో ఉండగా, క్రమానుగత శ్రేణి గల ఉద్యోగిస్వామ్యం (బ్యూరోక్రసీ)పై స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు విస్తరించింది. శాసనాలు, చట్టాలు నియమ నిబంధనలతో కూడిన పాలనా వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు అన్ని స్థాయిల్లో వెలిశాయి. ప్రభుత్వ పాలన అంతా ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వ్యవస్థతో ముడిపడి ఉంటోంది. ఠి పరిపాలన– ఆవిర్భావం– అర్థం: గవర్నెన్స్ లేదా పరిపాలన అనే పదం రాజనీతిశాస్త్రం, పాలనాశాస్త్రం, పరిధులను అధిగమించి అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం, రాజకీయాలు, అంతర్జాతీయ విషయాలు, సాంస్కృతిక రంగం, దౌత్యనీతి వంటి అనేక రంగాలకు విస్తరించింది. వ్యవస్థల కార్యకలాపాలు ఏవైనప్పటికీ అన్నింటిలో గవర్నెన్స్ పదం కలసిపోయింది. ఆధునిక రాజ్య వ్యవస్థ పరిణామ క్రమం మొత్తం.. వ్యవస్థల పెరుగుదల, అభివృద్ధి, సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటోంది. ఈ వ్యవస్థల కార్యకలాపాల సమాహారాన్ని పరిపాలన అని పిలవడం 1980వ దశకం నుంచి ప్రారంభమైంది. ⇒పరిపాలన నిర్వచనం– భావన: ‘పరిపాలన’ అనే భావనను పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. కౌటిల్యుని అర్థ్ధశాస్త్రంలో పరిపాలనపై చర్చ జరిగింది. పరిపాలన ఒక కళ అని, అది సమన్యాయం, విలువలు, నియంతృత్వ వ్యతిరేక పోకడలు వంటి లక్షణాలను కలిగి ఉంటుందని కౌటిల్యుడు పేర్కొన్నాడు. రాజ్యం.. దాని సంపద, పౌరులను సంరక్షిస్తూనే వాటి ప్రయోజనాలకోసం పాటుపడాల్సిన బాధ్యత పాలకునిపై ఉంటుందని కౌటిల్యుడు సూచించాడు. ⇒పరిపాలన భావన ఎంతో ప్రాచీనమైనది అయినప్పటికీ, దాని నిర్వచనంపై ఏకాభిప్రాయం లేదు. ‘గవర్నెన్స్’అనే పదం ‘కుబేర్నాన్’ అనే గ్రీకు మూల పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థాన్ని ప్లేటో.. వ్యవస్థీకృత పాలనా నమూనాను తయారుచేయటం అని పేర్కొన్నాడు. ‘కుబేర్నాన్’ మధ్యయుగాల్లో లాటిన్ పదమైన ‘గుబెర్నేర్’తో సమానార్థాన్ని కలిగి ఉంది. నియమాల రూపకల్పన, నియంత్రణ అని దీనికి వివరణ ఇచ్చారు. ‘గుబెర్నేర్’ పదాన్ని ప్రభుత్వానికి సమానపదంగా కూడా గుర్తించారు. ⇒ ఆక్స్ఫర్డ్ నిఘంటువు ప్రకారం ‘గవర్నెన్స్’ అంటే పాలనా పద్ధతి, ప్రక్రియ, కార్యాలయ పని విధానం, పరిపాలన. 1980వ దశకం తర్వాత రాజనీతి శాస్త్రవేత్తలు, గవర్నెన్స్‌ను ప్రభుత్వం నుంచి విడదీసి దానికి పౌరసమాజ వర్గాలను జతచేశారు. దీనివల్ల గవర్నెన్స్ నిర్వచనాల పరిధి, రూపం మార్పు చెందింది. ⇒వనరుల మార్పిడి, పరిపాలన నియమాలు, రాజ్యం నుంచి గణనీయమైన స్వయం ప్రతిపత్తి వంటి లక్షణాలు గల స్వీయ నియంతృత్వ వ్యవస్థలు, సమూహాల పరస్పర ఆధారిత కార్యకలాపాలను పరిపాలనగా చెప్పవచ్చు. ⇒ప్రభుత్వ విధానాల రూపకల్పన, రచన వాటి అమలు తదితర బాధ్యతల నిర్వర్తన సమాహారమే పరిపాలన. లాంఛనప్రాయ, లాంఛనేతర రాజకీయ నియమాల నిర్వహణను పరిపాలన అనవచ్చు. దీంట్లో అధికార వినియోగానికి సంబంధించిన నియమాల రూపకల్పన, ఆ నియమాల మధ్య ఏర్పడే వైరుధ్యాలను పరిష్కరించడం వంటి అంశాలు ఇమిడి ఉంటాయి. యూఎన్డీపీ ప్రకారం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) నిర్వచనం ప్రకారం గవర్నెన్స్ అంటే విలువలు, విధానాలు, వ్యవస్థల సమాహారం. వీటి ద్వారా సమాజం తన ఆర్థిక, రాజకీయ, సాంఘిక వ్యవహారాలను నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియలో రాజ్యం, పౌరసమాజం, ప్రైవేటు రంగాల మధ్య పరస్పర సంబంధాలతో పాటు రాజ్య వ్యవస్థల మధ్య సమన్వయం కూడా ఏర్పడుతుంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం ప్రపంచ బ్యాంకు నిర్వచనాల ప్రకారం పౌరుల ఉమ్మడి ప్రయోజనాల కోసం ఒక దేశంలో సార్వభౌమాధికారాన్ని రాజ్య వ్యవస్థలు సంప్రదాయ పద్ధతులతో వినియోగించటాన్ని పరిపాలన అంటారు. ఇందులో ప్రభుత్వంపై పౌరుల పర్యవేక్షణ, ప్రభుత్వాన్ని తొలగించే అధికారం, ఉత్తమ విధానాలతో ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడే ప్రభుత్వ సామర్థ్యం ఇమిడి ఉంటాయి. పౌరులకు, రాజ్యానికి తన వ్యవస్థలపై గౌరవం ఉండాలి. వ్యవస్థలు ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రగతిశీల మార్పునకు దోహదం చేస్తాయి. ⇒ గవర్నెన్స్– భావన: గవర్నెన్స్ అనే పదం క్లుప్తంగా విధానాల నిర్ణయీకరణ ప్రక్రియ–ఆయా నిర్ణయాలను అమలు చేస్తున్న పద్ధతి అని చెప్పొచ్చు. ముఖ్యంగా గవర్నెన్స్ అనే పదాన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చి, వాటి ఉద్దేశాలు, లక్ష్యాలను సాధించే ప్రక్రియగా పేర్కొనవచ్చు. ⇒ఇటీవలి కాలంలో గవర్నెన్స్‌ను గుడ్‌గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్, మొబైల్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్, గ్లోబల్ గవర్నెన్స్, నేషనల్ గవర్నెన్స్, లోకల్ గవర్నెన్స్ తదితర పేర్లతో వివిధ వ్యవస్థల్లో పిలుస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి, నూతన ప్రభుత్వ నిర్వహణ ప్రక్రియల కొనసాగింపుగా∙గవర్నెన్స్‌ను భావించొచ్చు. గవర్నెన్స్– మౌలిక సూత్రాలు గవర్నెన్స్‌కు ఆరు మౌలిక సూత్రాలుంటాయని ప్రపంచబ్యాంకు అధ్యయనం తెలిపింది. ఇవి ప్రపంచంలోని దాదాపు 200 దేశాలకు వర్తిస్తాయి. కాబట్టి వీటిని విశ్వజనీన అంశాలుగా పరిగణిస్తారు. అవి.. 1. ప్రజల వాణి– జవాబుదారీతనం 2. రాజకీయ సుస్థిరత 3. హింసారహిత సమాజం 4. ప్రభుత్వ కార్యసాధకత 5. నియంత్రణ నాణ్యత 6. అవినీతి నియంత్రణ ఈ సూత్రాల ఆధారంగా ప్రపంచబ్యాంకు ఏటా పరిపాలనా సామర్థ్య నివేదికను రూపొందిస్తుంది. ప్రపంచబ్యాంకు 1992లో ప్రకటించిన ‘‘గవర్నెన్స్ అభివృద్ధి’’ నివేదికకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. దీని ఆధారంగా గవర్నెన్స్ పదం ప్రముఖంగా ఉపయోగంలోకి రావటంతో పాటు దానిపై చర్చలు జరిగాయి. నివేదిక ప్రధానంగా మూడు అంశాలను చర్చించింది.. 1. రాజకీయ అధికార స్వరూపం 2. దేశ ఆర్థిక, సామాజిక వనరులను అభివృద్ధికి వినియోగించడంలో– అనుసరించే అధికార ప్రక్రియ 3. విధాన రూపకల్పన, దాని అమలుకు సంబంధించి ప్రభుత్వ సామర్థ్యం. ⇒ప్రపంచీకరణ నేపథ్యంలో గవర్నెన్స్ స్థానంలో∙గవర్నెన్స్ –గుడ్ గవర్నెన్స్ (పరిపాలన– సుపరిపాలన) భావనలు ఏర్పడ్డాయి. ⇒సుపరిపాలన– భావన: ప్రపంచీకరణ నేపథ్యంలో ఆవిర్భవించిన పరిపాలన భావనలు, అభివృద్థి చెందుతున్న దేశాల్లో చేపట్టిన సంస్కరణలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రపంచ బ్యాంకు ప్రకారం సుపరిపాలన అంటే ఆరోగ్యవంతమైన అభివృద్ధి నిర్వహణ విధానం. దీనికి నాలుగు సూత్రాలను గుర్తించారు. అవి ⇒ప్రభుత్వ రంగ నిర్వహణ, జవాబుదారీతనం, అభివృద్ధికి అవసరమైన చట్టబద్ధమైన వ్యవస్థ; పారదర్శకత, సమాచారాన్ని అందుబాటులో ఉంచడం. సుపరిపాలన – ప్రధాన లక్షణాలు ⇒ప్రజలందరికీ సమన్యాయం అందించడం. ⇒హేతుబద్ధత, ఆర్థిక పరిపుష్టితో కూడిన పారదర్శక నిర్ణయాలను ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేయడం. ⇒మితిమీరిన జాప్యం, లంచగొండితనం నియంత్రించడానికి కఠినమైన వ్యవస్థాపన, శాసనపరమైన / చట్టపరమైన చర్యలు చేపట్టడం. ⇒సుపరిపాలన భవిష్యత్ సమాజ అవసరాలను తీర్చేదిగా ఉంటుంది. అవినీతిని తగ్గించేందుకు, అణగారిన, బలహీన, అల్పసంఖ్యాక వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. భారతదేశంలో చేపట్టిన చర్యలు ⇒ సమాచార హక్కు చట్టం – 2005 ⇒సివిల్ సర్వీసులు, ప్రభుత్వ సర్వీసుల్లో సంస్కరణలు, పరిపాలన సంస్కరణలు, వేతన సంఘం సిఫార్సులు ⇒జాతీయ ఎలక్ట్రానిక్ పాలన ప్రణాళికలు ⇒జామ్ –కార్యకలాపాల విస్తరణ, (జన్‌ధన్ యోజన బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డులు, మొబైల్ నంబర్ల అనుసంధానం). ⇒ఆర్థిక కార్యకలాపాలకు పాన్‌కార్డు(పర్మినెంట్ అకౌంట్ నంబర్) అనుసంధానం. డా‘‘ ఎం.లక్ష్మణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిజాం కాలేజీ -
ఆ పోలీసులపై చర్య తీసుకోవాలి
శివరాజు అక్రమ నిర్బంధంపై పౌరహక్కుల సంఘం నాయకుల డిమాండ్ నార్లాపూర్ నుంచి తీసుకెళ్లి పస్రాలో పట్టుబడినట్లు కట్టు కథలు అల్లుతున్నారని ధ్వజం హన్మకొండ : తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు చెందిన సిద్దబోయిన శివరాజును అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై చర్య తీసుకోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు అనంతుల సురేష్, ప్రధాన కార్యదర్శి రమేష్ చందర్ నాయకులు మాదన కుమారస్వామి, గుంటి రవితో కూడిన పౌరహక్కుల సంఘం (సీఎల్సీ) బృందం తాడ్వాయి మండలం నార్లాపూర్‌కు వెళ్లి శివరాజు ఉదంతానికి సంబంధించి గ్రామస్తులు, కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరించింది. ఈ మేరకు ఆ వివరాలను సంఘం విడుదల చేసింది. వారి కథనం ప్రకారం.. ఈ నెల 11న ఉదయం 9 గంటలకు సాధారణ దుస్తుల్లో ఇద్దరు వ్యక్తులు ఆటోలో నార్లాపూర్‌కు చేరుకున్నారు. నేరుగా మద్యం షాపునకు వెళ్లి మద్యం తాగుతూ యజమానితో మాటమాట కలిపి సిద్ధబోయిన శివరాజుకు సంబంధించిన వివరాలు సేకరించారు. సెల్‌ఫోన్ నంబర్ తీసుకున్నారు. అక్కడి నుంచి శివరాజు ఇంటికి వెళ్లి తాము ఖమ్మం జిల్లా వాజేడు నుంచి వచ్చామని శివరాజు స్నేహితులమని ఇంట్లో ఉన్న శివరాజు సోదరితో చెప్పారు. అక్కడి నుంచి శివరాజుకు ఫోన్ చేసి అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. గ్రామ చివరలో ఉన్న టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు అశోక్ ఇంట్లో కలుద్దామని చెప్పి, అక్కడే కలుసుకున్నారు. తన కు 10 ఎకరాల భూమి కావాలని, కొనడానికి వచ్చానని నీ సాయం కావాలని కోరాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తిని సాగనంపడానికి శివ రాజు ఆటో దగ్గరికి వెళ్లగానే ఆటోలో కూర్చు న్న మరో వ్యక్తి అతడిని ఆటోలోకి లాగగా బయట ఉన్న వ్యక్తి కాళ్లు ఎత్తి ఆటోలో పడేశా డు. ఈ ఘర్షణలో శివరాజు తలకు గాయమైం ది. ఊరు చివర్లో ఇల్లు ఉండంతో జన సంచా రం లేదు. ఒక అమ్యాయి ఈ దృశ్యాన్ని చూస్తుండగానే క్షణాల్లో ఆటో వెళ్లి పోయింది. ఆమె ద్వారా సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు శివరాజును ఎవరో గుర్తుతెలియని అగంతుకులు ఆపహరించుకుపోయారని తాడ్వాయి పోలీసులకు ఫోన్ చేశారు. అనంతరం మంత్రి చందులాల్, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ కాక లింగయ్య కు ఫోన్ చేశారు. అయినా ఆచూకీ తెలియలేదు. అదేరోజు సాయంత్రం కిరణ్‌ను ఇదే పద్ధతిలో పస్రాలో ఎత్తుకుపోయి మరుసటి రోజు వదిలిపెట్టారు. శివరాజు కుటుంబ సభ్యులు వెళ్లి ములుగు ఏఎస్పీ విశ్వజిత్‌ను కలిస్తే తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగిన శివరాజు అరెస్టుపై పోలీసు లు కట్టుకథలు అలా ్లరు. మావోయిస్టు కేకేడ బ్ల్యూ కార్యదర్శి దామోదర్ కొరియర్‌గా సిద్దబోయిన శివరాజు పని చేస్తున్నాడని, పస్రా వ ద్ద ములుగు, ఏటూరు నాగారం పోలీసులకు పట్టుబడినట్లు శివరాజును తనిఖీ చేయగా నాలుగు డిటోనేటర్లు, నాలుగు జిలెటిన్ స్టిక్స్ దొరికినట్లు ప్రకటించి అసత్య ప్రకటనలు చేశారని పౌరహక్కుల సంఘం నాయకులు పేర్కొన్నారు. చట్ట ప్రకారం 24 గంటల్లో కోర్టులో ప్రవేశ పట్టాల్సి ఉండగా మూడు రోజులుగా అక్రమంగా నిర్భందించారని పేర్కొన్నారు. కోయ సామాజిక వర్గానికి చెందిన శివరాజు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని, టీఆర్ఎస్లో క్రియాశీల కార్యకర్త అని తెలిపారు. మంత్రి చందులాల్ గెలుపుకు అ హర్నిశలు కృషి చేశాడని ఒక వైపు తలవెం ట్రులు తీసుకొని దీక్ష బూనిన ఉద్యమకారుడని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న నక్సలైట్ల ఎజెండా ఇదేనా అని పౌర హక్కుల సంఘం ప్రశ్నించింది. శివరాజును అక్రమంగా అరెస్టు చేసిన పోలీసుల పేర్లు ప్రకటించి వారిని కఠి నంగా శిక్షించాలని, అన్యాయంగా బనాయిం చిన కేసులను ఎత్తివేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. -
ఈ రాబందుల నుంచి న్యాయవ్యవస్థే కాపాడాలి
‘రాజధాని దురాక్రమణ’పై పౌరసమాజం స్పందన సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతిపై వాలిన రాబందుల రెక్కల్లో చిక్కుకున్న బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ భూమిని కాపాడాలని పౌర సమాజం న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేసింది. ‘రాజధాని దురాక్రమణ’ శీర్షికన సాక్షి దినపత్రిక బుధవారం ప్రచురించిన కథనంపై పౌర సమాజం ప్రత్యేకించి హక్కుల సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఆ భూమిని ప్రభుత్వమే సేకరించాలి రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసిన ప్రభుత్వ పెద్దలు ఆయా ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు.ఆ భూముల్ని ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద తీసుకోవాలి. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల్ని కొనుగోలు చేయడంపై విచారణ జరిపించాలి. కె.నారాయణ, సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు చంద్రబాబుది బరితెగింపు చంద్రబాబు అడ్డగోలు పాలనకు ఇది నిదర్శనం, ఎవ్వరూ ఏమీ చేయలేరన్న బరి తెగింపుతోనే ఆయన అనుచరులు పేదల భూముల్ని చౌకధరలకు కొనుగోలు చేశారు. ఈ తెరవెనుక బాగోతాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయించాలి. - మధు, సీపీఎం పేదల్ని బజారు పాల్జేశారు రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు లేకుండా చేసే కుట్రలో భాగంగానే వారికిచ్చిన అసైన్డ్ భూముల్ని కారు చౌకగా కొన్నారు. తక్షణం ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు తిరిగివ్వాలి. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం తీరు మొదట్నుంచి అనుమానాస్పదంగానే ఉంది. - గాదె దివాకర్, న్యూడెమోక్రసీ ‘హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి’ విజయవాడ: రాజధాని ప్రాంతంలో వెలుగుచూసిన కోట్లాది రూపాయల భూకుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విచారణ జరిపి వివరాలు ప్రజల ముందుంచాలి రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ ప్రముఖుల అవినీతిపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై విచారణ జరిపించాలి. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుతంపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారం పంచుకుంటున్న పార్టీగా బీజేపీ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. -సుధీష్ రాంబొట్ల, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
బాల్యమిత్ర
నిరాదరణకు పర్యవసానమే అనాథలు! వాళ్లకు మనమున్నాం అని చెప్పడమే కాదు నిలబడి చూపించడమే ఆదరణ! ఆ బాధ్యతను తాము పంచుకుంటూ పౌర సమాజమూ పాలుపంచుకునేలా చూస్తోంది బాల్యమిత్ర నెట్వర్క్! దీనికింద పనిచేస్తున్న స్నేహఘర్, రెయిన్బో హోమ్సే కళ్లముందు కనిపిస్తున్న ఉదాహరణలు.. మా పిల్లల బర్త్‌డేస్ అక్కడ.. విమెన్ ఇన్ నెట్వర్క్ లాంటి స్వచ్ఛంద సంస్థలో చురుకైన భాగస్వామిగా ఉన్న యాంకర్ ఝాన్సీ రెయిన్బో హోమ్స్కీ ఆత్మీయ అతిథి. ‘ నేను మా పిల్లలతో సహా ముషీరాబాద్‌లోని రెయిన్బో హోమ్‌కి రెగ్యులర్‌గా వెళ్తాను. అన్నధారకూ కంట్రిబ్యూట్ చేస్తున్నాను. మా పిల్లలు వాళ్ల బర్త్‌డేలను అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ హోమ్స్‌లో అమేజింగ్ టాలెంట్ ఉన్న పిల్లలు ఎందరో. వాళ్లను ఎంకరేజ్ చేయాలనేదే మా ప్రయత్నం. ఏ కొంచెం టైమ్ దొరికినా పిల్లలతో రెయిన్బో హోమ్‌కి వెళ్లిపోతాను. నేను వెళ్లడమే కాదు నాకు తెలిసినవాళ్లనూ ఇన్వాల్వ్ చేస్తున్నాను. తనికెళ్ల భరణిగారు కూడా తనకు వీలు చిక్కినప్పుడల్లా మేడిబావిలోని స్నేహఘర్కు వెళ్తుంటారు. ఇప్పుడు మారియట్ హోటల్ తన ఇంపాక్ట్ డేని వీళ్లతో కలసి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా హ్యాపీగా ఉందని’ అన్నారు ఝాన్సీ. అమన్ వేదికతోపాటు ఇంకో తొమ్మిది స్వచ్ఛంద సంస్థలు కలసి ఏర్పడిందే బాల్యమిత్ర నెట్వర్క్. నిరాదరణ, లైంగిక అఘాయిత్యాలు వంటి రకరకాల దాష్టీకాలకు బలైన పిల్లల కోసం దేశవ్యాప్తంగా స్నేహఘర్, రెయిన్బో హోమ్స్ అనే స్కూళ్లను నిర్వహిస్తోంది ఈ నెట్వర్క్. అబ్బాయిల కోసం స్నేహఘర్, అమ్మాయిల కోసం రెయిన్బో హోమ్స్. మన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఈ హోమ్స్ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాంగణంలో అందరికీ జవాబుదారీగా ఈ హోమ్స్ నడుస్తున్నాయి. వీటి ప్రధాన లక్ష్యం.. ఈ పిల్లలకు చదువు చెప్పిస్తూ వాళ్లనూ సమాజంలో భాగంగా మార్చడం. అంటే ఆ బాధ్యతను పౌరసమాజం తీసుకోవడం. చదువుల్లో, ఆటపాటల్లో, ఇతర యాక్టివిటీస్‌లో ఈ పిల్లలు నిజంగా రత్నాలే. ఎటొచ్చి వీళ్లకు కావల్సింది మేమున్నామనే భరోసా. మనమంతా ఒక కుటుంబమనే బంధం. ఇలాంటి భావాన్ని ఈ పిల్లల్లో కల్పించడం కోసం ఈ హోమ్స్ చేయని ప్రయత్నం లేదు. అయితే వీటి నిర్వహణకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయమూ లేదు. అందుకే వీరి భోజన ఖర్చు కోసమని ఇటీవలే ఈ హోమ్స్ ‘అన్నధార’ అనే కార్యక్రమం చేపట్టింది. మన జీవితంలోని అత్యంత ముఖ్యమైన బర్త్‌డే లాంటి వేడుకలను మనం ఈ పిల్లలతో గడపడం.. మన ఆనందాన్ని వాళ్లతో పంచుకోవడమే కాదు ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించినవారం అవుతాం. మారియట్ ఇంపాక్ట్ డే ‘ఈ కార్యక్రమానికి మారియట్ హోటల్ ముందుకొచ్చింది. తన ఇంపాక్ట్ డేని ఈ పిల్లలతో కలసి సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు మారియట్ హోటల్లో సెలబ్రిటీలను అతిథులుగా పిలిచి ఈ పిల్లలకు ఆత్మీయులుగా చేయదలిచారు. ఆ రోజు మా పిల్లల ఆటాపాటా, చిత్రలేఖనం వంటి యాక్టివిటీస్ ఉన్నాయ’ని చెప్పారు రెయిన్బో హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కొండెపూడి అనురాధ. - శరాది -
కబ్జాదారులకు మాజీ మంత్రి అండ
పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి బసంత్ నగర్, న్యూస్‌లైన్ : మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అండదండలతోనే జిల్లాలో భూకబ్జాదారుల ఆగడాలు ఎక్కువయ్యాయని పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి ఆరోపించారు. కన్నాలలో భూకబ్జా చేశారనే కారణంతో ఆత్మహత్య చేసుకున్న గణపతి ప్రభాకర్ కుటుంబాన్ని సోమవారం ఆయన పౌరహక్కుల సంఘం నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారుల వైఫల్యంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. ఇందుకు అధికారులతో పాటు స్థానిక ఫోర్‌లైన్ కాంట్రాక్ట్ సంస్థ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. కన్నాల బోడ గుట్టపై అక్రమ మైనింగ్ కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మృతుడి కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆక్రమణకు గురైన మృతుడి భూమిని పరిశీలించారు. ఆయన వెంట సంఘం ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు ప్రసాద్, కోశాధికారి అక్బర్, కార్యవర్గ సభ్యుడు రాజగోపాల్ ఉన్నారు. -
మీడియాను లొంగదీసుకునే యత్నం
హైదరాబాద్ పౌరసమాజ ప్రతినిధుల వేదిక సాక్షి, హైదరాబాద్: ‘హిందూ’ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నగేష్‌కుమార్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు నిజాం కాలంకన్నా ఘోరంగా ఉందని హైదరాబాద్ నగర పౌరసమాజ ప్రతినిధుల వేదిక ధ్వజమెత్తింది. ఈ ఘటనపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరింది. ఇదే విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు వేదిక ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎ.గోపాలకిషన్ , హనుమాన్‌చౌదరి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సోమరాజు, నిమ్స్ మాజీ డెరైక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ సమయంలోనూ జర్నలిస్టులు, పత్రికలపై ఇంతటి నిర్బంధం లేదన్నారు. ఇది కేవలం ఒక పత్రికపై దాడి కాదని, మొత్తం మీడియాను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నమని వారు ఆరోపించారు. ఈ విషయంపై జర్నలిస్టు సమాజం మొత్తం స్పందించడం అభినందనీయమన్నారు.