హైకోర్టు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్-7 వల్ల స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని నీలేరాయ్, కాలేశ్రేయ అనే ఇద్దరు స్పోర్ట్స్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రొఫెషనల్ కోర్సు(మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ తదితర)లలో స్పోర్ట్స్ కోటాను ఎత్తివేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టును కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్-7లో స్పోర్ట్స్ కోటాలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని న్యాయవాది రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. దీంతో గత నెల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్-7పై కోర్టు స్టే ఇచ్చింది. ఏడాది పాటు ప్రొఫెషనల్ కోర్సులలో స్పోర్ట్స్ కోటాను పరిగణనలోనికి తీసుకోవద్దని హైకోర్టు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment