♦ డిపోల ఎదుట ధర్నాలు
♦ జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు
♦ అడ్డుకున్న పోలీసులు పలువురి అరెస్టు
ఖమ్మం : మున్సిపాల్ కార్మికుల వేతనాలు పెంచాలని తలపెట్టిన దీక్షలను భగ్నం చేయడం, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రాజకీయ పక్షాలు తలపెట్టిన బంద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీలు ఆయా పార్టీల అనుబంధ సంఘాలు మద్దతు తెలిపాయి. ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, వైరా, మధిర, ఇల్లెందు, అశ్వారావుపేట, పాలేరు నియోజకవర్గాల పరిధిలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసి వేయించారు. బస్‌డిపోల వద్దకు వెళ్లి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం బస్టాండ్‌ల వద్ద ధర్నా చేస్తున్న వామపక్ష పార్టీలతోపాటు, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
అఖిలపక్ష బంద్‌లో వైఎస్సార్ సీపీ శ్రేణులు
ఖమ్మం : ఎండనక.. వాననక రేయింబవళ్లు చెత్తాచెదారంతో జీవనం సాగిస్తూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికుల కనీస కోర్కెలను తీర్చాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్షం పిలుపు మేరకు నిర్వహించిన తెలంగాణ బంద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాల్గొంది. ఖమ్మం నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిర్వహించిన ధర్నాకు ఆ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయ నుంచి బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో వారు పాల్గొన్నారు.
కార్యక్రమంలో కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సంపెట వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందడపు వెంకటేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ ముస్తఫా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నాయకులు పగడాల భాస్కర్‌నాయుడు, భీమనాధుల అశోక్‌రెడ్డి, కొంగర జ్యోతిర్మయి, తుమ్మా అప్పిరెడ్డి, తన్నీరు శ్రీను, కొత్తగొండ్ల శ్రీలక్ష్మి, పొదిలి వెంకటేశ్వర్లు, జాకబ్‌ప్రతాప్, దుంపల రవికుమార్, ఇస్లావత్ రాంబాబు, నారుమల్ల వెంకన్న, ఆరెంపుల వీరభద్రం, వెనిగళ్ల నాగేశ్వరరావు, ఎవి నాగేశ్వరరావు, కొండలరావు, గుండపనేని ఉదయ్‌కుమార్, సింగు శ్రీను, ఫసీయుద్దీన్, శివాజి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
బంద్ ప్రశాంతం
Published Sat, Jul 18 2015 3:33 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement