మాట్లాడుతున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్
కరీంనగర్ అర్బన్: పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పటికీ, ఢిల్లీకి పరిమితం కాకుండా తనను గెలిపించిన ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సోమవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయనని అన్నారు. ప్రజాసమస్యల పరి ష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడిగా కాకుండా సామాన్య కార్యకర్తగా ప్ర జల్లోకి వెళ్లి పనిచేస్తానన్నారు. నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తానని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉ న్నందున అధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచిం చారు. కేంద్ర సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తానని చెప్పారు. గ్రామాల్లో ఇప్పుడిప్పుడే కేంద్ర సంక్షేమ పథకాలపై అవగాహన వచ్చిందన్నారు.
ఎమ్మెల్యేగా ఓటమి.. ఎంపీగా గెలుపు..
రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలిచి.. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓటమి చెంది మూడోసారి ఎంపీగా గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇందులో యువత పాత్ర కీలకంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఓడినా తిరిగి ఎంపీగా పోటీ చేయాలని యువత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. తమ స్వంత ఖర్చులతోనే యువత ప్రచారం చేశారని చెప్పారు. భారత్ మాతాకి జై.. అంటూ గ్రామగ్రామాన తిరిగి ప్రచారం చేశారన్నారు. యువత పట్టుదలతో కరీంనగర్‌లో బీజేపీని గెలిపించారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ఉంటే తప్ప ఢిల్లీకి వెళ్తానే తప్పా మిగితా సమయంలో కరీంనగర్‌లోనే ఉంటూ ప్ర జాసంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. మంత్రి పదవిపై సోషల్ మీడియా వస్తున్నది అవాస్తమని కార్పొరేటర్ నుంచి పార్లమెంట్ స్థానంలో కూర్చున్నానన్నారు. మంత్రి పదవిపై ఆశలు లేవన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటూ సేవ చేయడమే ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
హిందూ ఏక్తా యాత్ర విజయవంతం చేయాలి
ప్రతీఏటా నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 29న సాయంత్రం 4 గంటలకు వైశ్యభవన్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ముఖ్య అతిథులుగా దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు సిద్దేశ్వరానందగిరి స్వామి, సామాజిక సమరసతా వేధిక తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ హాజరవుతారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, కార్పొరేటర్ రాపర్తి విజయ, జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ, నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, కన్నబోయిన ఓదెలు, హరికుమార్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మహిళ మోర్చా నాయకురాలు గాజుల స్వప్న, అనిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment