సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో వాసవీ బ్యాంక్ నుంచి రుణం పొంది మోసం చేసిన కేసులో నిందితుడు బి.భీమారావుకు సీఐడీ ప్రత్యేక కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.5 వేలు జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి పి.భాస్కర్‌రావు బుధవారం తీర్పునిచ్చారు. సీఐడీ తరఫున అదనపు పీపీ అజయ్‌కుమార్ వాదనలు వినిపించారు.
ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేసేందుకు వాసవీ బ్యాంకు నుంచి తప్పుడు ఆస్థి పత్రాలను కుదువపెట్టి 1996లో రూ.40 లక్షలు భీమారావు రుణం పొందారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు సీఐడీకి ఫిర్యాదు చేశారు.