భీమదేవరపల్లి: భీమదేవరపల్లిలో నకిలీ పాసుబుక్కుల వ్యవహారం సంచలనం రేపుతోంది. రోజుకో విధంగా ఈ కేసు మలుపు తిరుగుతుండడంతో పోలీసులు తమ విచారణను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ సంఘటనలో ఇప్పటికే తిమ్మాపూర్ డెప్యూటీ తహశీల్దార్‌తో పాటుగా మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రెండు పాసుబుక్కులను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈ నకిలీ వ్యవహారంలో హస్తం ఉన్న మరో ఆరుగురిని సోమవారం అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
దాంతో మండలంలో ఈ సంఘటన చర్చనీయంశంగా మారింది. మండలంలో పలు గ్రామాల్లోని రైతులు పంట రుణాలు, రుణమాఫీ తదితర ప్రభుత్వ రుణాల కోసం నకిలీ పాసుబుక్కుల కలిగి ఉన్నారనే ఫిర్యాదుల మేరకు పోలీసులు మండలంలోని బ్యాంక్‌లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్, ముల్కనూర్ స్టేట్ బ్యాంక్, వంగర, కట్కూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లపై హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ నిఘా పెంచినట్లు సమాచారం.
దళారుల్లో గుబులు
రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని పనులు చేయిస్తామంటూ రైతులను, ప్రజలను మోసం చేస్తున్న దళారుల్లో సైతం గుబులు పట్టుకుంది. ప్రతి గ్రామంలో ఈ దళారీ వ్యవస్థ పాతుకుపోవడంతో అధికారులు నేరుగా రైతులకు పనులు చేయకుండా దళారుల ద్వారానే పనులు చేస్తుండడంతోనే ఈ అక్రమ దందా ఇంతకాలం కొనసాగింది. మండలంలోని మల్లారం, ఎర్రబెల్లి, కొత్తకొండ, ధర్మారం, కట్కూర్, భీమదేవరపల్లిలో పలు నకిలీ పాసు బుక్కులు కలిగి ఉన్న రైతులను సైతం త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎవరినీ వదిలిపెట్టం
- సదన్‌కుమార్, సీఐ, హుస్నాబాద్
నకిలీ పాసు బుక్కుల సంఘటనలో ఎవరినీ వదిలిపెట్టం. వి విధ బ్యాంక్‌లలో సైతం రైతులు నకిలీ పాసు బుక్కు లు తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లు మా దృష్టికి వచ్చింది. త్వరలోనే ఆ దిశగా విచారణ జరుపుతాం.
బ్యాంక్‌లపై పోలీస్ నిఘా
Published Mon, Mar 16 2015 4:01 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement