బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్ధం పడుతుందని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదన చారి అన్నారు.
చాంద్రాయణగుట్ట: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్ధం పడుతుందని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదన చారి అన్నారు. తెలంగాణ మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం బార్కస్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ....తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రంజాన్ సమయంలో ముస్లిం ప్రజలకు ఈద్ ముబారక్ ప్యాక్‌లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం బతుకమ్మ పండుగకు కూడా నిధులు విడుదల చేశారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజీవ్ రాజు తదితరులు పాల్గొన్నారు.