నవీన్ మిట్టల్, అల్లం నారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సాక్షి చీఫ్ రిపోర్టర్ బొల్గం శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008, 2009, 2010 సంవత్సరాల్లో ఎంపిక చేసిన ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రతిభ కనబరిచిన తెలంగాణకు చెందిన 15 మంది జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందించింది. రాష్ట్ర విభజనతో ఎనిమిదేళ్ల పాటు ఈ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడింది. ఎట్టకేలకు మంగళవారం సమాచార భవన్ మీటింగ్ హాల్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఎంపికైన జర్నలిస్టులకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారం అందజేశారు. సాక్షి చీఫ్ రిపోర్టర్ బొల్గం శ్రీనివాస్ 2009 సంవత్సరానికి గాను ఖాసా సుబ్బారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు అందుకున్నారు. కరీంనగర్‌లో పని చేసిన సమయంలో రాసిన ‘జోల పాట‘మానవీయ కథనానికి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను ‘సాక్షి’ చైర్‌పర్సన్ వైఎస్ భారతి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment