దేవాలయ ఉద్యోగులకు మంచి భవిష్యత్ | better future to Temple employees | Sakshi
Sakshi News home page

దేవాలయ ఉద్యోగులకు మంచి భవిష్యత్

Published Fri, May 30 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

దేవాలయ ఉద్యోగులకు మంచి భవిష్యత్

దేవాలయ ఉద్యోగులకు మంచి భవిష్యత్

 యాదగిరికొండ, న్యూస్‌లైన్, తెలంగాణలోని దేవాలయాలకు, ఆలయ ఉద్యోగులకు మంచి భవిష్యత్ ఉందని టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జి.దేవీప్రసాద్ అన్నారు. యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని సంగీత భవనంలో సంయుక్త కమిషనర్ దేవాల యాలు, ఉప సహాయక కమిషనర్ దేవాలయాల ఉద్యోగుల ఐక్యకారచరణ సమితి ఆవిర్భావ సభలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో ఆలయ ఉద్యోగుల పాత్ర అద్వితీయమైనదని కొనియాడారు. ఆ త్యాగాలను వచ్చే తెలంగాణ ప్రభుత్వం మరిచిపోదని గుర్తు చేశారు.

 ప్రతి తెలంగాణ ఉద్యోగి బిడ్డలందరూ సుఖసంతోషాలతో ఉండాల్సిన అవ సరం ఉందని అన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్ వ్వవస్థను రద్దు చేసి ఉన్న వారికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని అన్నారు.  దేవాలయాల ఉద్యోగుల సమస్యలు తీర్చకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్చకులు చేసిన యజ్ఞ, యాగాదులు కూడా తెలంగాణ ఏర్పాటుకు దోహదమయ్యాయని అన్నారు.

ఏఈఓ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులకూ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చే సుమారు రూ.5 కోట్ల మొత్తాన్ని సీఎం ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అందజేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హడావిడిగా పోలవరం ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. పోలవరం ముంపు గ్రామాలలో సుమారు 10 వేల మంది ఉద్యోగులున్నారని, వారి భవితవ్యం ఏంకావాలని కేంద్రం భావిస్తుందని దేవీప్రసాద్ ప్రశ్నించారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చట్టసభలల్లో తమ వాణిని వినపించేందుకు ఎంపీగా పోటీలో ఉండాలని దేవీప్రసాద్‌ను కోరుతూ దేవాలయ ఉద్యోగులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేసీఆర్ సూచనల మేరకే ఏమైనా జరుగుతుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు కొందరు నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉద్యోగాలను పొందారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఎన్‌జీఓ రాష్ట్ర కార్యద ర్శి కారం రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర దేవాలయాల ఉద్యోగుల జేఏసే చెర్మైన్ గజ్వెల్ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement