దక్షిణాఫ్రికాలో భద్రాద్రి వాసి మృతి | Bhadradri dude killed in South Africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాలో భద్రాద్రి వాసి మృతి

Published Wed, May 31 2017 12:59 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

దక్షిణాఫ్రికాలో భద్రాద్రి వాసి మృతి - Sakshi

దక్షిణాఫ్రికాలో భద్రాద్రి వాసి మృతి

పుట్టిన రోజునే రోడ్డు ప్రమాదం
 
భద్రాచలం టౌన్‌: దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో ఈ నెల 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రా చలానికి చెందిన పోతి నేని నవీన్‌ (32) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాచలంలోని గొల్ల బజార్‌కు చెందిన నవీన్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఐదేళ్ల క్రితం జోహెన్స్‌బర్గ్‌కు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా స్థిరపడ్డాడు. ఈ నెల 26న తన పుట్టిన రోజు వేడుకను స్నేహితు లతో ఘనంగా జరుపుకున్నాడు. అనంత రం కారులో ముగ్గురు మిత్రులతో కలిసి సినిమాకు వెళ్తుండగా కారు రిపేర్‌కు వచ్చింది.

మెకానిక్‌ వచ్చి మరమ్మతు చేస్తున్న క్రమంలో టూల్‌ బాక్స్‌లో ఓ వస్తువు తీస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయాన్ని నవీన్‌ బంధు వులకు మిత్రులు సమాచారం అందిం చారు. నవీన్‌ మృతదేహం బుధవారం భద్రాచలానికి చేరుకుంటుంది. కాగా, నవీన్‌కు ఇటీవలే పెళ్లి కుదిరింది. వచ్చే నెలలో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. నవీన్‌ తండ్రి ఐదేళ్ల క్రితం, తల్లి మూడేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి అతని బాగోగులను మేనమామ, ఐటీసీ కాం ట్రాక్టర్‌ లక్ష్మణ్‌రావే చూస్తున్నారు. మృతుడికి సోదరుడు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement