రామాయంపేట: 108 అంబులెన్సులకు తోడు త్వరలో బైక్ అంబులెన్సులు రానున్నాయి. రాష్ట్రంలో మొదటి విడతగా 200 వరకు బైక్ అంబులెన్సులు మంజూరయ్యాయి. హైదరా బాద్‌తోపాటు, జాతీయ రహదారులపై ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో బైక్ అంబులెన్సుల్లో పనిచేయడానికి గాను సిబ్బంది నియామక ప్రక్రియ ఆదివారం కామారెడ్డిలో జరగనుంది. పట్టణాలు, నగరాల్లో అత్యంత రద్దీ ప్రాంతాలకు, మూరుమూల గ్రామాలకు, చిన్న చిన్న గల్లీలకు వెళ్లడానికి 108 అంబులెన్సులకు కష్టతరమవుతుండగా, బుల్లెట్ అంబులెన్సులతో ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంది. డిసెంబర్‌లోనే ఇవి రోడ్డెక్కనున్నట్లు 108 వర్గాలు తెలిపాయి.
బైక్ అంబులెన్సులతో తక్షణ వైద్య సేవలు
108 అంబులెన్సులు వెళ్లలేని గల్లీలకు, మారుమూల గ్రామాలకు బైక్ అంబులెన్సులు సులభంగా వెళ్తాయి. సకాలంలో వెళ్లి తక్షణమే వైద్య సేవలు అందిస్తాయి. ఈలోగా 108 అంబులెన్సులు అక్కడికి వెళ్లి రోగిని సమీపంలోని ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంటుంది. వీటిని ఫస్ట్ రెస్పాండర్ బైక్ అంబులెన్సుగా పిలుస్తారు. –జాన్ షాహిద్, ఐదు జిల్లాల 108 ప్రోగ్రామ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment