
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరలో ‘108’ బైక్ అంబులెన్స్‌ల సేవలు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి మూడు వరకు జరిగే జాతర కోసం పది బైక్ అంబులెన్స్‌లు కేటాయించారు.
రవాణా సదుపాయం సరిగా లేని ఏటూరునాగారం, ములుగు, భద్రాచలం, మణుగూరు వంటి ఏజెన్సీ ప్రాంతాల క్షతగాత్రులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు అంబులెన్స్‌లు పంపినట్లు 108 చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రహ్మానందరావు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఇరుకైన, రద్దీ రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో గాయపడినవారికి సత్వర వైద్యసేవలు అందించేందుకు బైక్ అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఇవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి.