
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు సందర్భంగా వైఎస్ జగన్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నా’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘ వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా నా శుభాకాంక్షలు’ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు, ‘యువనేత వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ‘జగన్ ఆయురారోగ్యాలతో, నిండునూరేళ్లు జీవించాలని మనçస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని మంత్రి గంటా ట్వీట్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత ‘జగనన్నా.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిడే’ అని శుభాకాంక్షలు తెలిపారు. ‘వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు, మీకు ఆ దేవుడు సుఖసంతోషాలతో కూడిన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని ఇండియా టీవీ చీఫ్ ఎడిటర్, చైర్మన్ రజత్ శర్మ ట్వీట్ చేశారు. సినీ హీరో సుమంత్ కూడా వైఎస్ జగన్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘వైఎస్ జగన్ గారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు.. మీకు ఏపీ ప్రజ లకు ఈ ఏడాది ప్రత్యేకంగా ఉంటుందని నేను చెబుతున్నాను’ అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ తనకు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ, సినీ ప్రముఖులకు, పార్టీ నాయకులకు, శ్రేణులకు, మీడియా సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఇంత ప్రేమ, ఆదరాభిమానాలు చూపించడం అదృష్టంగా భావిస్తున్నానని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment