'కేసీఆర్‌ ఊహాలోకంలో ఉన్నారా' | bjp leader indrasena reddy slams cm kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌ ఊహాలోకంలో ఉన్నారా'

Published Thu, Jun 22 2017 1:51 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

'కేసీఆర్‌ ఊహాలోకంలో ఉన్నారా' - Sakshi

'కేసీఆర్‌ ఊహాలోకంలో ఉన్నారా'

హైదరాబాద్‌: ప్రభుత్వ భూముల రక్షణ కోసం కొత్తగా తెచ్చిన ఆర్డినెన్సు చూస్తే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతోందని బీజేపీ సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఆర్డినెన్సు ద్వారా ప్రభుత్వ భూముల రక్షణ ఉంటుదనే నమ్మకం మాకులేదు. ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న చిత్త శుద్ధి భూముల రక్షణపై లేదు.
 
ఇందులో పొందుపరిచిన విషయాలు న్యాయస్థానాలను అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. గతంలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర రాజధానిలో ఇంత తంతు జరుగుతున్నా సీఎం కేసీఆర్‌కు తెలియడం లేదా అంటే ఆయన ఊహాలోకంలో ఉన్నారా అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement