22న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహం వరంగల్ సమావేశంలో ఖరారు కానుందని బీజేపీ తెలిపింది. ఈనెల 22, 23వ తేదీల్లో వరంగల్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధివిధానాలను చర్చిస్తామన్నారు. దీని తర్వాత ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు జిల్లా కార్యవర్గ సమావేశాలు ఆగస్టు 5వ తేదీ నుంచి 9 వరకు మండలస్థాయి సమావేశాలు జరుపుకోనున్నామని వివరించారు.
అనంతరం ఆగస్టు 10 నుంచి 20 వ తేదీ వరకు వివిధ ప్రజాల సమస్యలపై ఆందోళనలు, నవంబర్, డిసెంబర్‌లలో వివిధ స్థాయిల్లో వివిధ సమస్యలపై నిరసనలు తెలుపుతామన్నారు. వరంగల్ సమావేశానికి కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు ప్రధాన కార్యదర్శులు రామ్ మాధవ్, మురళీధర్ రావు హాజరవుతారని వివరించారు. సెప్టెంబర్‌లో బీజేపీ ఛీఫ్ అమిత్‌షా రాష్ట్ర పర్యటన వివరాలను కూడా ఈ సందర్భంగా ఖరారు చేస్తామన్నారు.