కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: కాపుల సామాజిక వర్గంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపుల సామాజిక వర్గం చాలా బలమైందన్న ఆయన.. శాఖలుగా, వర్గాలుగా కాపులు ఉండటంతో వారిలో ఐక్యత లేదన్నారు. వారంతా ఏకమైతే అక్కడ రాజకీయ పరిస్థితులు వేరుగా ఉండేవని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం అంతగా ఉండదని తెలిపారు. 'ప్రజారాజ్యం ఎలా అయ్యిందో చూసారు కదా! ఒక పార్టీని నడిపించడం అంటే చిన్న విషయం కాదు' వ్యాఖ్యానించారు. బీజేపీ ఏపీలో అడుగు పెట్టాలని చూస్తోందని, అందుకే కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లుందని తెలిపారు.