మైనర్‌... మృగం! | Boy sodomised, killed by minor neighbour in Hyderabad | Sakshi
Sakshi News home page

మైనర్‌... మృగం!

Published Fri, Jul 7 2017 12:48 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

మైనర్‌... మృగం! - Sakshi

మైనర్‌... మృగం!

పదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడి
విషయం బయటపడకుండా హత్య
దారుణానికి ఒడిగట్టిన 17 ఏళ్ల మైనర్‌


హైదరాబాద్‌: పదేళ్ల బాలుడిపై 17 ఏళ్ల మైనర్‌ అసహజ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. విషయం బయటపడకూ డదని ఆ పసి మొగ్గను చిదిమేశాడు. మిస్సింగ్‌గా నమోదైన ఈ కేసును దర్యాప్తు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులకు సీసీ కెమెరాల్లో చిన్న ఆధారం దొరికింది. నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. హత్య వెలుగులోకి వచ్చింది.

తినుబండారాలు ఎరగా చూపి..
బార్కాస్‌ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ జమీల్‌ ఖాన్‌ కుమారుడు మహ్మద్‌ ఖాన్‌(10) స్థానిక లయోలా పాఠ శాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. రంజాన్‌ నేపథ్యంలో బార్కాస్‌ బజార్‌లో ఏర్పాటైన మేళా దగ్గర జూన్‌ 28న ఈ చిన్నారి ఆడుకుంటున్నాడు. అక్కడి నుంచి ఖాన్‌ అదృశ్యం కావడంతో కుటుంబీకులు మరుసటి రోజు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బడీ మసీదు వద్ద ఆడుకుంటున్న ఖాన్‌కు బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపిన మైనర్‌.. అతడిని బార్కాస్‌ ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పాఠశాల గ్రిల్స్‌ తొలిగించి భవనంపైకి చేరుకుని, అక్కడే చిన్నారిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తండ్రికి చెపుతా అనటంతో హత్య..
బాలుడు తనకు నొప్పిగా ఉందని, విషయం తండ్రికి చెపుతా ననటంతో మైనర్‌ తీవ్రంగా భయపడ్డాడు. జూలై 2న తన సోదరి వివాహం ఉండటంతో విషయం బయటకు వస్తే పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉందని భావించాడు. అఘాయిత్యం వెలుగులోకి రాకూడదంటే బాలుడిని హత్య చేయడమే మార్గ మని భావించాడు. అక్కడే ఉన్న రాడ్లు, కర్రలతో బాలు డిపై కిరాతకంగా దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని మా యం చేసే ఉద్దేశంతో కాళ్లు, చేతులు కట్టేశాడు. మృతదేహాన్ని మరో చోటికి మార్చడానికి రెండుసార్లు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో మిన్నకుండిపోయాడు. ఉదంతం జరిగింది మూడో అంతస్తుపైన కావడం, పాడు బడినట్లు ఉండే అక్కడికి ఎవరూ వెళ్లకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు.

సీసీ కెమెరాల్లో దొరికిన ఆధారం..
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్కాస్, చాంద్రాయణ గుట్ట పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బడీ మసీ దు ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ సాంకేతిక సమస్యతో ఓపెన్‌ కాలేదు. బుధవారం ఆ ఫీడ్‌ ఓపెన్‌ కావడంతో పరిశీ లించారు. 28న మధ్యాహ్నం 1.28 గంటలకు ఖాన్‌ను ఓ యువ కుడు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. బాలుడి తండ్రి ఆ యువ కుడు తన ఇంటి పక్కనే ఉండే మైనర్‌గా గుర్తించారు. ఎనిమిదో తరగతి వరకే చదివిన అతడు ప్రస్తుతం పాన్‌షాప్‌లో పనిచే స్తున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని సీసీ కెమెరా ఫుటేజ్‌ చూపించడంతో నేరం అంగీకరించాడు. గురువారం ఉదయం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

గతంలోనూ ఇదే తరహా ఘాతుకాలు..
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఇప్పటి వరకు 15 మందిపై ఇదే తరహాలో లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. వారందరి నుంచి వాంగ్మూలాలు తీసుకుని మరికొన్ని కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. 20 ఏళ్ల లోపు పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తుండటంతో ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూసేందుకు బానిసలవుతు న్నారని, దీంతో మైనర్లు కూడా విచక్షణ కోల్పోయి ఘాతుకాలకు పాల్పడుతు న్నారని సౌత్‌జోన్‌ డీసీపీ వి.సత్యనారాయణ చెప్పారు. తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement