Ten year old boy
-
ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి?
నెక్కొండ/ఎంజీఎం, వరంగల్: కొందరి ఆర్ఎంపీల వైద్యానికి నిత్యం ఏదో ఒక చోట అయాయకులు బలవుతున్నారు. తాజాగా మండలంలోని ముదిగొండకు చెందిన కావటి మణిదీప్ (10) కూడా ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరలైంది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కావటి కోటేశ్వర్, సరిత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మణిదీప్ ఇటీవల కుక్క కాటుకు గురయ్యాడు. దీంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ అశోక్.. ఈ నెల 11వ తేదీన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశాడు. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీనిపై సదరు ఆర్ఎంపీ.. గుట్టుచప్పడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రహస్య ఒప్పంద కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ విషయం వైరల్ కావడంతో తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) వెంటనే స్పందించి సుమోటోగా స్వీకరించింది. దీంతో వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ బృందానికి జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని చైర్మన్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య సోమవారం ఆదేశించారు.కాగా, వరంగల్ టీజీఎంసీ సభ్యుడు శేషుమాధవ్, టీజీఎంసీ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్‌కుమార్, రాష్ట్ర ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి, వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ అన్వర్‌మియా, వరంగల్ హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు కొలిపాక వెంకటస్వామి, తానా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాకేశ్ నేతృత్వంలోని వైద్య బృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనుందని ఆదేశాల్లో పేర్కొంది. -
చిన్న వయసు.. పెద్ద మనసు
సాక్షి, గాలివీడు (కడప): ఆ బాలుడి వయసు పదేళ్లు.. అందరు పిల్లల్లాగా ఆడుతూ పాడుతూ తనదైన లోకంలో విహరించడంతోనే సరిపెట్టుకోలేదు. సొంతూరులోని ఓ ఆలయ పునరుద్ధరణకు భూరి విరాళమిచ్చి పెద్దమనసు చాటు కున్నాడు. వివరాలిలా.. గాలివీడుకు చెందిన భువనేశ్వరి సింగపూర్‌లో ఉంటున్నారు. ఆమె కుమారుడు బండ్లకుంట బాహుబలేయ. గాలివీడులో శిథిలావస్థలో ఉన్న చారిత్రక పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దాతల సహకారంతో పునరుద్ధరిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాహుబలేయ తాను నాలుగేళ్లుగా పొదుపు చేసుకున్న రూ.50 వేల నగదును విరాళంగా అందించాలనుకున్నాడు. తన అమ్మమ్మ లక్ష్మిదేవి, తాతయ్య దివంగత పులి వెంకటరమణల పేరు మీద రాయచోటిలోని కుటుంబ సభ్యుల ద్వారా నగదును శనివారం కమిటీ సభ్యులకు అందజేశాడు. -
మైనర్... మృగం!
♦ పదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడి ♦ విషయం బయటపడకుండా హత్య ♦ దారుణానికి ఒడిగట్టిన 17 ఏళ్ల మైనర్ హైదరాబాద్: పదేళ్ల బాలుడిపై 17 ఏళ్ల మైనర్ అసహజ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. విషయం బయటపడకూ డదని ఆ పసి మొగ్గను చిదిమేశాడు. మిస్సింగ్‌గా నమోదైన ఈ కేసును దర్యాప్తు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులకు సీసీ కెమెరాల్లో చిన్న ఆధారం దొరికింది. నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. హత్య వెలుగులోకి వచ్చింది. తినుబండారాలు ఎరగా చూపి.. బార్కాస్ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ జమీల్ ఖాన్ కుమారుడు మహ్మద్ ఖాన్(10) స్థానిక లయోలా పాఠ శాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. రంజాన్ నేపథ్యంలో బార్కాస్ బజార్లో ఏర్పాటైన మేళా దగ్గర జూన్ 28న ఈ చిన్నారి ఆడుకుంటున్నాడు. అక్కడి నుంచి ఖాన్ అదృశ్యం కావడంతో కుటుంబీకులు మరుసటి రోజు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బడీ మసీదు వద్ద ఆడుకుంటున్న ఖాన్‌కు బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపిన మైనర్.. అతడిని బార్కాస్ ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పాఠశాల గ్రిల్స్ తొలిగించి భవనంపైకి చేరుకుని, అక్కడే చిన్నారిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తండ్రికి చెపుతా అనటంతో హత్య.. బాలుడు తనకు నొప్పిగా ఉందని, విషయం తండ్రికి చెపుతా ననటంతో మైనర్ తీవ్రంగా భయపడ్డాడు. జూలై 2న తన సోదరి వివాహం ఉండటంతో విషయం బయటకు వస్తే పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉందని భావించాడు. అఘాయిత్యం వెలుగులోకి రాకూడదంటే బాలుడిని హత్య చేయడమే మార్గ మని భావించాడు. అక్కడే ఉన్న రాడ్లు, కర్రలతో బాలు డిపై కిరాతకంగా దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని మా యం చేసే ఉద్దేశంతో కాళ్లు, చేతులు కట్టేశాడు. మృతదేహాన్ని మరో చోటికి మార్చడానికి రెండుసార్లు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో మిన్నకుండిపోయాడు. ఉదంతం జరిగింది మూడో అంతస్తుపైన కావడం, పాడు బడినట్లు ఉండే అక్కడికి ఎవరూ వెళ్లకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. సీసీ కెమెరాల్లో దొరికిన ఆధారం.. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బార్కాస్, చాంద్రాయణ గుట్ట పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బడీ మసీ దు ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్ సాంకేతిక సమస్యతో ఓపెన్ కాలేదు. బుధవారం ఆ ఫీడ్ ఓపెన్ కావడంతో పరిశీ లించారు. 28న మధ్యాహ్నం 1.28 గంటలకు ఖాన్‌ను ఓ యువ కుడు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. బాలుడి తండ్రి ఆ యువ కుడు తన ఇంటి పక్కనే ఉండే మైనర్‌గా గుర్తించారు. ఎనిమిదో తరగతి వరకే చదివిన అతడు ప్రస్తుతం పాన్‌షాప్‌లో పనిచే స్తున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని సీసీ కెమెరా ఫుటేజ్ చూపించడంతో నేరం అంగీకరించాడు. గురువారం ఉదయం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గతంలోనూ ఇదే తరహా ఘాతుకాలు.. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఇప్పటి వరకు 15 మందిపై ఇదే తరహాలో లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. వారందరి నుంచి వాంగ్మూలాలు తీసుకుని మరికొన్ని కేసులు నమోదు చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. 20 ఏళ్ల లోపు పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తుండటంతో ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూసేందుకు బానిసలవుతు న్నారని, దీంతో మైనర్లు కూడా విచక్షణ కోల్పోయి ఘాతుకాలకు పాల్పడుతు న్నారని సౌత్‌జోన్ డీసీపీ వి.సత్యనారాయణ చెప్పారు. తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. -
అతడికి ఫేస్బుక్ భారీ బహుమతి
శాన్ ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ పదేళ్ల బాలుడికి 10,000 డాలర్ల నజరానా ప్రకటించింది. ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో లోపాన్ని గుర్తించినందుకు జానీకి సంస్థ అధినేత జుకర్‌బర్గ్ బహుమతి ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి లాగిన్ అవ్వకుండానే కామెంట్లు, క్యాప్షన్లను తొలగించే బగ్‌ను జానీ కనుగొన్నాడు. దాని కోసం ఒక కోడ్ తయారు చేశారు. ఫిబ్రవరిలో దీని గురించి చెప్పాడని మార్చిలో నజరానా ప్రకటించామని ఫేస్బుక్ తెలిపింది.