‘బడ్జెట్ అంకెల గారడీ’
Published Mon, Mar 13 2017 2:10 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొండను తొవ్వి ఎలుక తోక చూపించారు. అంకెల గారడీలా ఈ బడ్జెట్ ఉందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ గత బడ్జెట్ పూర్తిగా ఖర్చు పెట్టలేదు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ఉంది. వ్యవసాయానికి నామమాత్రపు కేటాయింపులు చేశారు.
బీసీలకు కేటాయించిన నిధులు సరిపోవని చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకానికి నిధులే లేవని, అన్నదాతలకు ఆశాజనకంగా లేదన్నారు. అన్ని రంగాలను నిరుత్సాహపరిచారని విమర్శించారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ అబద్దాలు తప్ప ఏమీ లేదు. గత బడ్జెట్లో డబ్బులు ఖర్చు చేయలేదు. ఒకవైపు ఆదాయం లేదని 82శాతం మాత్రమే ఖర్చు అవుతుందని అబద్దాలు చెబుతున్నారు. సంక్షేమ పథకాలకు నిధులు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు అల్లావుద్దీన్ అద్భుత దీపం చూపిస్తున్నారు. కేసీఆర్ సభను మోసం చేశారుని ఆరోపించారు. బడ్జెట్ డబ్బులు ఖర్చు చేయనందుకు సంబురాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. విదేశీ విద్యార్థులు, విదేశాల్లో ఉన్న వారి కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదు. అన్ని రంగాల వారికి బడ్జెట్లో మోసం జరిగిందని, తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టారని ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి అన్నారు.
Advertisement