mlc sudhakar reddy
-
‘బడ్జెట్ అంకెల గారడీ’
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొండను తొవ్వి ఎలుక తోక చూపించారు. అంకెల గారడీలా ఈ బడ్జెట్ ఉందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ గత బడ్జెట్ పూర్తిగా ఖర్చు పెట్టలేదు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ఉంది. వ్యవసాయానికి నామమాత్రపు కేటాయింపులు చేశారు. బీసీలకు కేటాయించిన నిధులు సరిపోవని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి నిధులే లేవని, అన్నదాతలకు ఆశాజనకంగా లేదన్నారు. అన్ని రంగాలను నిరుత్సాహపరిచారని విమర్శించారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ అబద్దాలు తప్ప ఏమీ లేదు. గత బడ్జెట్లో డబ్బులు ఖర్చు చేయలేదు. ఒకవైపు ఆదాయం లేదని 82శాతం మాత్రమే ఖర్చు అవుతుందని అబద్దాలు చెబుతున్నారు. సంక్షేమ పథకాలకు నిధులు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు అల్లావుద్దీన్ అద్భుత దీపం చూపిస్తున్నారు. కేసీఆర్ సభను మోసం చేశారుని ఆరోపించారు. బడ్జెట్ డబ్బులు ఖర్చు చేయనందుకు సంబురాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. విదేశీ విద్యార్థులు, విదేశాల్లో ఉన్న వారి కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదు. అన్ని రంగాల వారికి బడ్జెట్లో మోసం జరిగిందని, తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టారని ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి అన్నారు. -
ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైంది: కేకే
ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయి: ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి హైదరాబాద్: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. ఉపాధ్యాయుడికి ఒకప్పుడున్న గౌరవం ఇప్పుడు లేకుండా పోయిందన్నారు. ఉపాధ్యాయులపై తల్లిదండ్రులకు విశ్వాసం, నమ్మకం సన్నగిల్లడమే కారణమని అన్నారు. ఓ వైద్యుడు ఫెయిలైతే రోగి చనిపోతారు, న్యాయవాది ఫెయిలైతే కేసు నీరుగారుతుంది. కానీ ఉపాధ్యాయుడు ఫెయిలైతే ఓ తరం నష్టపోతుందన్నారు. శనివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో పీఆర్టీయూ తెలంగాణ శాఖ 5వ వార్షికోత్సవం జరిగింది. ‘విద్యా సంస్కరణలు - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.చెన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు కె.కేశవరావు (కేకే) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమస్యల సదస్సుకు పిలవొద్దు ఈ సందర్భంగా సదస్సుకు ఆహ్వానించి డిమాండ్లపై మాట్లాడటం సరికాదని కేకే అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల సదస్సుకు తనను ఎప్పుడూ పిలవద్దని అన్నారు. సమస్యలేమైనా ఉంటే తెల్లకాగితం మీద రాసి తనకిస్తే రెండు గంటల్లో పరిష్కరిస్తానన్నారు. విద్యా సంస్కరణల సదస్సుపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికి ఏ ఒక్క నాయకుడు మాట్లాడటం లేదన్నారు. ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ఉపాధ్యాయుల ద్వారానే ప్రవేశాలు తగ్గుముఖం పట్టాయనడంలో వాస్తవం లేదన్నారు. పాలనాపరమైన లోపాలతోనే అడ్మిషన్లు తగ్గుతున్నాయని అన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలని కోరారు. -
పారిశ్రామికవేత్తలకు పవర్
కేసీఆర్ ప్రకటనతో కొత్త ఊపు ♦ 24 గంటలూ ఇక కరెంట్ కోతలుండవని భరోసా ♦ కొడకంచిలో ఆటోమొబైల్ పరిశ్రమ ప్రారంభం ♦ పలుచోట్ల మొక్కలు నాటిన సీఎం పటాన్చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన పారిశ్రామికవేత్తల్లో కొత్త జోష్‌ను తెచ్చింది. పారిశ్రామిక రంగానికి 24 గంటలూ కరెంటు సరఫరా ఉంటుందని, ఇక కోతలు ఉండవని ప్రకటించడం వారిలో ఆనందాన్ని నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం పటాన్చెరు, జిన్నారం మండలాల్లో పర్యటించారు. మొదట పాశమైలారం పారిశ్రామికవాడలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. రుద్రారంలోని ఎంఎస్ఎన్, తోషిబా పరిశ్రమ ఆవరణలోనూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయా పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. ఆయన పర్యటన ఆద్యంతం గోప్యంగా సాగింది. పర్యటన షెడ్యూల్ ప్రకారం జరగలేదు. ఉదయం 11.45కి పటాన్‌చెరులోని ఈద్గాకు చేరుకుని మొక్కలు నాటి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తరువాత జిన్నారం మండలం కొడకంచిలో కొత్తగా ఏర్పాటుచేసిన డెక్కన్ ఆటో పరిశ్రమను ప్రారంభించారు. అక్కడ జరిగిన సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోనే నంబర్‌వన్ పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చామని, పారిశ్రామికవేత్తలు తెలంగాణలో భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. హరితహారం పథకాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు. తెలంగాణ అంతా పచ్చదనం పరచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశం అనంతరం పాశమైలారం పారిశ్రామికవాడకు వెళ్లారు. ఆ తరువాత రుద్రారంలో భోజనం చేసుకుని 2.15 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఆరోగ్యం సరిగ్గా లేదంటూనే ఆయన ఈ పర్యటనను విజయవంతంగా ముగించారు. ఇదిలా ఉండగా పటాన్చెరు దర్గా వద్ద స్థానిక ముస్లిం పెద్దలు సీఎంను సన్మానించారు. వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు కేసీఆర్‌కు బెలూన్లు పట్టుకొని స్వాగతం పలికారు. మొక్కలు నాటిన తరువాత కేసీఆర్ బెలూన్లను గాల్లోకి వదిలారు. ఉదయం 10.30 గంటలకే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు దేశపతిశ్రీనివాస్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈద్గా వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అయితే కేసీఆర్ నేతలతో కరచాలనం చేసి స్థానిక నాయకులను పలుకరిస్తూ ముందుకు సాగారు.