
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా వద్ద ఓ దివాకర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.దురాజ్ పల్లి వద్ద ఏపీ కి చెందిన దివాకర్ ట్రావెల్స్ (Ap02 TC 7695)బస్సు అదుపు తప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. వైజాగ్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమం గా ఉంది. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బోల్తా పడిన దివాకర్ ట్రావెల్స్ బస్సు