టీచర్లకు షోకాజ్ నోటీసులుఅక్రమ బదిలీల వ్యవహారంలో మరికొందరు ఉపాధ్యాయులపై వేటు పడింది. ఇప్పటికే డీఈఓ, ముగ్గురు డిప్యూటీ డీఈఓలపై వేటు పడిన విషయం విధితమే. బదిలీల వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతుండగానే పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ మరో తొమ్మిది మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని ఆదేశించారు.
- 9మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు
- వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలి
- ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్
- అక్రమ బదిలీ వ్యవహారం..
విద్యారణ్యపురి : జిల్లాలోని తొమ్మిది మంది ఉపాధ్యాయులయకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు షోకాజ్ నోటీస్‌లు జారీ చేశారు. ఈఏడాది జూలైలో చేపట్టిన టీచర్ల బదిలీ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు బదిలీఅయ్యాక వేరేచోటుకు మాడిఫికేషన్ చేయించుకున్నారని, మరికొందరు స్పౌజ్ కేటగిరీలోనూ నిబంధనలు అతిక్రమించారనే తదితర ఆరోపణలు వచ్చిన విషయం విదితమే ఈ వ్యవహారంపై తొలుత విద్యాశాఖ అడిషనల్ జాయింట్ డెరైక్టర్ సత్యనారాయనరెడ్డి విచారణ జరిపారు.
ఆరోపణలు వాస్తవమేనంటూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు నివేదించారు. తదుపరి పరిణామాల క్రమంలో డీఈవో చంద్రమోహన్ సస్పెండయ్యూరు. డిప్యూటీ డీఈవోలు రవీందర్‌రెడ్డి, అబ్దుల్‌హైనీని ఆదిలాబాద్, మరో డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తిని కరీంనగర్ జిల్లా డైట్ కళాశాలలకు బదిలీ చేశారు. బదిలీ అక్రమాల వ్యవహారంపై ఓవైపు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో 9మంది టీచర్లకు తాజాగా షోకాజ్ నోటీస్‌లు జారీచేశారు. డీఈవో కార్యాలయం నుంచి ఎంఈవోల ద్వారా ఉపాధ్యాయులకు వీటిని అందిస్తున్నారు.
‘షోకాజ్’లు వీరికే..
లింగాలఘనపురం మండలం నవాబ్‌పేట ఎంపీపీఎస్ ఎస్‌జీటీ ఎ.భీమా, చేర్యాల పెద్దమ్మగడ్డ పీఎస్ ఎస్‌జీటీ బి.కనకయ్య, దేవరుప్పల మండలంలోని ఎస్‌జీటీ శ్రీకాంత్, డోర్నకల్ మండలం చిలుకోడు జెడ్పీఎస్‌ఎస్ టీచర్లు రవీందర్, రజనీ, జనగామాలోని ఎస్‌జీటీ శిరోమణి, దేవరుప్పల మండలం మారముల్ల పాఠశాల ఎస్‌జీటీ అరుణకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వీరు తమ మాడిఫికేషన్‌ను ఎందుకు రద్దు చేయరాదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ అయ్యూయి.
అలాగే కొడకండ్ల మండలం అవుతాపరం ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ నీరజ తొర్రూరు మండలంలో పనిచేస్తున్న తన భర్త మండలానికి లేదా సమీప మండలాలకు స్పౌజ్ కేటగిరీ వినియోగించుకుని విన్నవించాల్సి ఉండగా, సంగెం మండం కాట్రపెల్లికి ఎలా బదిలీ అయ్యారనేది తెలియడంలేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని, ఈ బదిలీ ఎందుకు రద్దు చేయరాదో చెప్పాలంటూ నీరజకు నోటీస్ జారీ అయింది. దీంతో ఉపాధ్యాయులు ఇచ్చే వివరణ కీలకంగా మారింది. నోటీసులు అందిన వారంరోజుల్లో సంజారుుషీ ఇవ్వాలని పేర్కొంటూ షోకాజ్ నోటీస్‌ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. వీరితో కొందరు ఇప్పటికే షోకాజ్ నోటీసులు అందుకున్నారు. వీటికి జవాబు ఎలా ఇవ్వాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు.
మీ బదిలీ ఎందుకు రద్దు చేయొద్దు
Published Wed, Sep 9 2015 4:41 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM
Advertisement