నామినేషన్ల తిరస్కరణ | Candidates Rejection of nominations In Warangal | Sakshi
Sakshi News home page

నామినేషన్ల తిరస్కరణ

Published Wed, Nov 21 2018 10:31 AM | Last Updated on Mon, Dec 24 2018 12:35 PM

Candidates Rejection of nominations In Warangal - Sakshi

స్క్రూటినీ నిర్వహిస్తున్న రిటర్నింగ్‌ అధికారి వెంకటాచారి

సాక్షి, జనగామ: జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 12 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో తొమ్మిది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు. జనగామలో రెండు, పాలకుర్తిలో ఒక నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌ టీజేఎస్, టీడీపీ అభ్యర్థి నామినేషన్లు కొట్టుడుపోయాయి. జిల్లాలో మొత్తంగా 50 నామినేషన్లు ఓకే అయ్యాయి. ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉంది.

సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లోని ఆర్‌ఓ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు 62 మంది మొత్తం 113 నామినేషన్‌ సెట్లు  దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన మూడు నియోజకవర్గ ఆర్‌ఓ కేంద్రాల్లో చేశారు. 50 నామినేషన్లు సరిగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంవరణకు గడువు ఉంది. 
12 నామినేషన్ల తిరస్కరణ..
మూడు నియోజకవర్గాల్లో 12 నామినేషన్లను తిరస్కరించారు. అత్యధికంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో తొమ్మిది, జనగామలో రెండు, పాలకుర్తిలో ఒక నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యాయి. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో వివరాలు సరిగా లేని నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులకు ప్రతిపాదకుల వివరాల్లో తప్పులు, అడ్రస్, సంతకాలు చేయడంలో కొందరు మాత్రమే ఉండడంతో నామినేషన్లను తిరస్కరించారు.

టీజేఎస్, టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ..
స్టేషన్‌ ఘన్‌పూర్‌ టీజేఎస్‌ అభ్యర్థి చింత స్వామి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. బలపర్చే అభ్యర్థుల వివరాల్లో తప్పులు ఉండడంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థి శాగ రాజు నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. 

స్టేషన్‌ఘన్‌పూర్‌లో తొమ్మిది నామినేషన్లు తిరస్కరణ
స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో తొమ్మిది నామినేషన్లు తిరస్కరించారు. ఈ నియోజకవర్గానికి 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తప్పులు ఉండడంతో తొమ్మిది మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. 10 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు. 

జనగామ నియోజకవర్గం..
జనగామ నియోజకవర్గంలో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు. 

సక్రమంగా ఉన్న నామినేషన్లు: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(టీఆర్‌ఎస్‌), ఉడుత రవి (సీసీఎం), కుమార్‌ జేరిపోతుల(టీడీపీ), పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్‌), వెంకటలక్ష్మీ నర్సింహరెడ్డి కాల్వల(బీజేపీ), పిట్టల సత్యం (ఇండిపెండెంట్‌), సతీష్‌కుమార్‌ (బీఎస్‌పీ), మంతెన నరేష్‌ (ఆర్‌పీఐ(ఏ)), తిప్పతి సిద్ధులు (నవసమాజ్‌ పార్టీ), వెంకట రాజయ్య తాటికొండ (స్వరాజ్‌ పార్టీ), లక్ష్మణ్‌ భీం (సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌), అక్కలదేవి మోహన్‌రాజు (బహుజన రాష్ట్ర సమితి), తెట్టేబావి అంకే ఆనంద్‌కుమార్‌ (ఇండియన్‌ ప్రజాబంధు పార్టీ), నిమ్మ జయరామ్‌రెడ్డి (ఆమ్‌ ఆద్మీ పార్టీ), మేర్గు శ్రీను, ఉపేందర్‌ జేర్రిపోతుల, కొండేటి మహేందర్‌రెడ్డి, పిట్టల సత్యం , కుమార్‌ జేర్రిపోతుల ,శాకంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ఇండిపెండెంట్లు)
తిరస్కరణకు గురైన నామినేషన్లు: ఇర్రి అహల్య(సీపీఎం), టీఏ ఆనంద్‌కుమార్‌(ఇండిపెండెంట్‌)

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం...
సక్రమంగా ఉన్న నామినేషన్లు: తాటికొండ రాజయ్య(టీఆర్‌ఎస్‌), సింగపురం ఇందిర(కాంగ్రెస్‌), రాజారపు ప్రతాప్‌ (బీఎస్పీ), పెరుమాండ్ల వెంకటేశ్వర్లు(బీజేపీ), గుండె విజయరామారావు (ఇండిపెండెంట్‌), బొట్ల శేఖర్‌ (సీపీఎం), మంద రమేష్, సురభి సత్తయ్య, జేరిపోతుల ఉపేందర్, మాదాసి వెంకటేష్‌ (ఇండిపెండెంట్లు)
తిరస్కరణకు గురైన నామినేషన్లు: శాగ రాజు (టీడీపీ), చింత స్వామి(టీజేఎస్‌), చిలుక జాన్, గ్యార నర్సింగరావు, మునిపెల్లి ఆనందం, బొక్క ప్రభాకర్, ,క్రాంతికుమార్, తూము కుమారస్వామి, అనిల్‌కుమార్‌ గాదేపాక (ఇండిపెండెంట్లు)

పాలకుర్తి నియోజకవర్గం...
సక్రమంగా ఉన్న నామినేషన్లు: బిల్లా సుధీర్‌రెడ్డి (కాంగ్రెస్‌), ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీఆర్‌ఎస్‌), జంగా రాఘవరెడ్డి (కాంగ్రెస్‌), జంగా సుజాత (కాంగ్రెస్‌), ఎర్రబెల్లి ఉషాదేవి(టీఆర్‌ఎస్‌), జిలుకర శ్రీనివాస్‌ (బీఎస్పీ), పెదగాని సోమయ్య (బీజేపీ), మధురశ్రీ గౌడ్‌ లింగాల (జై స్వరాజ్‌ పార్టీ), మామిండ్ల రమేష్‌ రాజా (సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌), విశ్వనాథ గోస్వామి (ఆర్‌పీఐ), గారె వెంకటేష్‌ (సమాజ్‌వాదీపార్టీ), మక్కెర్ల నాగలక్ష్మీ(బీఎల్‌పీ), రాపర్తి రాజు (బీఎల్‌పీ), తండా ఉపేందర్‌ (తెలంగాణ ప్రజాపార్టీ), ఇనుల యుగేందర్‌రెడ్డి(బీజేపీ), లకావత్‌ విజయ్‌కుమార్‌ (సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ), హరినాథ్‌ గోపాలదాస్‌ (తెలంగాణ యువశక్తి), కూనబోయిన కుమారస్వామి (తెలంగాణ కార్మిక రైతురాజ్యం పార్టీ), మాచర్ల శ్రీనివాస్‌ (సీపీయూఐ), గోల గంగారావు, కొర్ర నర్సింహ, సింగారపు దయాకర్, రాము బైరెల్లి(ఇండిపెండెంట్లు)
తిరస్కరణకు గురైన నామినేషన్లు: కర్నె లక్ష్మణ్‌రావు(లోక్‌తాంత్రిక్‌ సరోజన సమాజ్‌ పార్టీ)  

హన్మకొండ అర్బన్‌..16 మంది 
ఎన్నికల ప్రక్రియలో మరో కీలక అంకం ముగిసింది. నామినేషన్ల పరిశీలన పూర్తయింది. వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట నియోజక వర్గాల్లో ఎక్కడ కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాలేదు. మొత్తంగా మూడు నియోజకవర్గాల్లో 97 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించారు. వరంగల్‌ పశ్చిమలో 27 మందికిగాను 23 ఆమోదం పొందగా.. నలుగురి నామినే షన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. వర్ధన్నపేటలో 33 మంది అభ్యర్థులకు 27 ఆమోదం పొందగా.. ఆరుగురి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. వరంగల్‌ తూర్పులో 37 మంది అభ్యర్థులకు 31 ఆమోదం పొందాయి.  ఆరుగురి నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి వీపీ.గౌతమ్‌ వెల్లడించారు. మొత్తంగా నర్సంపేట/పరకాల/వర్ధన్నపేట నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం ముగిసింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి 72 నామినేషన్లు దాఖలు కాగా, స్క్రూటినీ అనంతరం 11 తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో పరకాలలో రెండు, వర్ధన్నపేటలో ఆరు, నర్సంపేటలో మూడు నామినేషన్లు ఉన్నాయి. నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా 16 మంది నామినేషన్లు వేయగా వారిలో మంగళవారం ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు 

వర్ధన్నపేటలో..ఆరు      
వర్ధన్నపేట శాసన సభ నియోజక వర్గానికి మొత్తం 33 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వైవీ.గణేష్‌ వివిధ కారణాలతో ఆరుగురు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. 27 మంది అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను ఆమోదించారు.

తిరస్కరించినవి..
కొత్త ఇందిర.. బీజేపీ నుంచి నామినేషన్‌ వేసి ఏ, బీ ఫారం అందజేయని కారణంగా తిరస్కరించారు.నమిండ్ల శ్రీనివాస్, బందెల రాజభద్రయ్య.. కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ వేసి ఏ, బీ ఫారం అందజేయని కారణంగా తిరస్కరించారు. కాందారి కళావతి.. ఓటర్ల జాబితాలో పేరు, వివరాలు లేనందున, అఫిడవిట్‌ నిబంధనల ప్రకారం పూర్తి చేయనందున తిరస్కరించారు.దూడల కట్టయ్య.. జై మహాభారత్‌ పార్టీ నుంచి వేశారు. ప్రతిపాదకులు ఒక్కరు మాత్రమే ఉన్నందున, 10 మంది లేని కారణంగా తరస్కరించారు. తవ్వల కమలాకర్‌.. పోటీ చేయడానికి సరిపడా వయసు లేనందున తిరస్కరించారు.

ఆమోదం పొందినవి..
గంధం శివæ (బీఎస్‌పీ), అరూరి రమేష్‌ (టీఆర్‌ఎస్‌), కొత్త సారంగరావు (బీజేపీ), వెంకటస్వామి సుదమల్ల (తెలంగాణ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), పగిడిపాటి దేవయ్య (టీజేఎస్‌), నద్దునూరి సంపత్‌ (సమాజ్‌వాదీ), బండి క్రాంతికుమార్‌ (తెలంగాణ కార్మిక రైతురాజ్యం), చిలుముల్ల లెనిన్‌ (సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌), వశపాక నర్సింహస్వామి (బీఎల్‌ఎఫ్‌), దర్శనపు రమేష్‌ (ఆప్‌), తాటికాయల సతీష్‌బాబు (సంపూర్ణభారత్‌ క్రాంతి పార్టీ), కాందారి జనార్ధన్‌ (ఇండిపెండెంట్‌), ఇల్లందుల శోభన్‌బాబు, జెట్టి స్వామి, కొండేటి శ్రీధర్, తుమ్మల యాకయ్య, జన్ను నర్సయ్య, ఏఆర్‌నినా ప్రేంరెడిరిపిక, అరూరి కుమార్, జన్ను నిశాంత్‌కుమార్, జన్ను కుమారస్వామి, చాడ రాజ్‌కుమార్, కంజర్ల దయాకర్, ఆరెపల్లి కమలాకర్, విసంపల్లి నాగేష్, కొండేటి ఏలిషా, జన్ను మధుకర్‌ (ఇండిపెండెంట్‌).


వరంగల్‌ ‘తూర్పు’లో.. 6  తిరస్కరణ
వరంగల్‌ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల పరిశీలన పక్రియ మంగళవారం అర్ధరాత్రి దాటే వరకూ కొనసాగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సంబంధించి వరంగల్‌ తూర్పులో అత్యధికంగా 37 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం విశేషం. గ్రేటర్‌ ప్రధాన కార్యాలయంలో కమిషనర్, నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి వీపీ.గౌతమ్, ఏఆర్‌ఓలు.. వివిధ పార్టీలు, ఇండిపెండెంట్‌  అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. నియోజవర్గంలో మొత్తం  37 మంది 72 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ముగ్గురు అభ్యర్థులు రాజకీయ పార్టీలతోపాటు ఇండిపెండెంట్‌గా నామినేషన్‌పత్రాలు సమర్పించడంతో అభ్యర్థుల సంఖ్య 40కి చేరింది. నామినేషన్ల పరిశీలన తర్వాత 31 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 
ఆమోదం పొందిన వారి వివరాలు
నన్నపునేని నరేందర్‌ (టీఆర్‌ఎస్‌), గాదె ఇన్నారెడ్డి (టీజేఎస్‌), ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు (ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌), రవి చంద్ర, (కాంగ్రెస్‌), కుసుమ సతీష్‌ (బీజేపీ), రాంబాబు సిద్దం (బీఎల్‌ఎఫ్‌), ఎ.కిషోర్‌ (ఎస్‌పీ), రాజనాల శ్రీహరి, రహీమున్నీసా, అచ్చ విద్యాసాగర్, రంగరాజు రవీందర్, వడ్నాల శ్యాంకుమార్, పాలడుగు సురేందర్,  మల్లోజు సత్యనారాయణ, చింతల అనిల్, గోరంటల శరత్‌బాబు, గై.సతీష్, మహ్మద్‌ సాధిక్, ఆకుల వెంకటేశ్వర్లు, జగన్‌ మోహన్, కందగట్ల రాజేశ్వర్‌ రావు, చిప్ప వెంకటేశ్వర్లు, సింగారపు రమేష్‌ బాబు, సండ్ర జాన్షన్, బోల్లం రాజు, బోడ్డు సతీష్, పొగాకు సుధీర్, నీలం రాజ్‌ కిషోర్, వడ్నాల సతీష్‌ కుమార్, చిప్ప వెంకటేశ్వర్లు, కిషోర్‌ రాపెల్లి (ఇండిపెండెంట్‌)
తిరస్కరణకు గురైన అభ్యర్థులు
జోన్నోతుల కిషన్‌ రెడ్డి (పిరమిడ్‌ పార్టీ),  గోపాల కృష్ణమూర్తి (టీపీ సమితిæ), బోలుగోడ్డు శ్రీనివాస్‌ (బీఆర్‌ఎస్‌æ), జాకీర్‌ హూస్సేన్, కేడల ప్రసాద్, కుసుమ రాజు (పెండెంట్‌).  

వరంగల్‌ ‘పశ్చిమ’లో..నాలుగు
వరంగల్‌ పశ్చిమ శాసన సభా నియోజక వర్గానికి నామినేషనేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో నలుగురి నామినేషన్‌ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి.  నామినేషన్ల పరిశీలన అనంతరం వివిధ కారణాలతో వీటిని తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కుక్కల వెంకారెడ్డి వెల్లడించారు. మొత్తం 27 నామినేషన్లు దాఖలు కాగా.. పరీశీలనలో నాలుగు తొలగించగా.. 23 మంది నామినేషన్లు ఆమోదం పొందినట్లు వెల్లడించారు.
తిరస్కరించినవి..

పద్మారావు.. బీజేపీ నుంచి నామినేషన్‌ దాఖలు చేయగా బీఫారం లేనికారణంగా నామినేషన్‌ తిరస్కరించారు.ఎలిగేటిæ భాస్కర్‌.. నామినేషన్‌ పత్రం అందజేసే సమయంలో ఓటర్ల జాబితాలో పేరు నిర్ధారణ విషయంలో సంబంధిత ఎలక్టోరల్‌ అధికారి ధ్రువీకరణ పత్రం లేకపోవడం, ప్రమాణపత్రం, ధరావత్తు చెల్లించకపోవడం, బలపరిచినవారిలో ఒకరు ఆర్‌ఓ ముందు వేలిముద్ర వేయకపోవడం వంటి కారణాలతో తిరస్కరించారు.నీలం భాస్కర్‌.. నామినేషన్‌ సందర్బంగా ధరావత్తు చెల్లించక పోవడం, అఫిడవిట్‌ పూర్తిగా నింపకపోవడం వంటి కారణాలతో తిరస్కరించారు. ఏటూరి వెంకటేశ్వర్‌రావు.. అభ్యర్థి, ప్రతిపాదకుల ఓటర్ల జాబితాలోని వివరాలు, పోలింగ్‌ కేంద్రం సరిగా లేకపోవడం, ఎన్నికల కమిషన్‌ నిబధనల ప్రకారం అఫిడవిట్‌ సమర్పించక పోవడం వంటి కారణాలతో తిరస్కరించారు.
ఆమోదించినవి..
ధర్మారావు మార్తినేని (బీజేపీ), కిరణ్‌ ఇమ్మడి (బీఎస్‌పీ), దాస్యం వినయ్‌భాస్కర్‌ (టీఆర్‌ఎస్‌), రేవూరి ప్రకాష్‌రెడ్డి (టీడీపీ), ఒల్లాజి రవీందర్‌ (బహుజన రాష్ట్ర సమితి), శ్రీకాంత్‌యాదవ్‌ దడబోయిన (బీఎల్‌ఎఫ్‌), సిరివోలు వెంకటరమణారావు (సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌), చిదురాల  రాజన్న (శివసేన), నక్కరాజేందర్‌రావు (దళిత బహుజన పార్టీ), కనకం సురేష్‌ (ఆర్‌పీఐ), గోక వెంకట్రావు (తెలంగాణ ప్రగతి సమితి), కృష్ణ కిషోర్‌ బండి (ఆప్‌), గోపు శ్రీనివాస్‌ (తెలంగాణ ప్రజాసమితి), నాయిని రాజేందర్‌రెడ్డి, తరుణహరి శేషయ్య, ఫారూక్‌ అహ్మద్‌ హుసాన్‌ మహ్మద్, సత్యప్రకాష్‌ పూసల, సమిడ్ల విక్రాంత్‌బాబు, ఇమ్మడి రవి, ఐనవోలు మహాప్రసాద్‌ శర్మ, కందకట్ల రాజేశ్వర్‌రావు, బాను లక్ష్మణ్‌ పబ్బా, విక్రం బొమ్మతి (ఇండిపెండెంట్‌).

పరకాల.. 2
పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా 23 మంది నామినేషన్‌ దాఖలు చేయగా ఇద్దరి నామినేషన్లను తిరస్కరించినట్లు పరకాల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌ మహేందర్‌జీ వెల్లడించారు. అందులో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా మురళీధర్‌రావు, బీజేపీ అభ్యర్థి పెసరు సుదేష్ణాదేవి నామినేషన్లు ఉన్నాయి. నిర్ణీత సమయంలో ఏ, బీ ఫారంలు సమర్పించకపోవడంతోపాటు 2బీలో ఒక్కరే ప్రతిపాదించడం కారణంగా వీరి నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. దీంతో 21 మంది అభ్యర్థులను అర్హులుగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌ మహేందర్‌జీ ప్రకటించారు. వీరిలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులు  నలుగురు పోటీలో ఉండగా, గుర్తింపు పొందని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏడుగురు, స్వతంత్ర అభ్యర్థులు 10 మంది ఉన్నారని ఆయన తెలిపారు.
 
వర్ధన్నపేటలో ఆరుగురు.. 
వర్ధన్నపేట: వర్ధన్నపేట అసెంబ్లీ స్థానానికి 33 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా మంగళవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వైవీ గణేష్‌ ఆరుగురి నామినేషన్లను తిరస్కరించారు. ఇందులో మొత్తం 54 నామినేషన్లు వేయగా 16 సెట్లను తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వారిలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన బందెల రాజభద్రయ్య, నమిండ్ల శ్రీనివాస్, బీజేపీ నుంచి కొత్త ఇందిర, జైమహాభారత్‌ పార్టీ నుంచి దూడల కట్టయ్య, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తవ్వల కమలాకర్, కాందారి కళావతి ఉన్నారు.

భూపాలపల్లిలో.. 
భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి 17 మంది అభ్యర్థులు 31 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా ఒకరి నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి నిరాకరించారు. మంగళవారం స్క్రూ టిని నిర్వహించగా స్వతంత్ర అభ్యర్థి అర్షం అశోక్‌ నామినేషన్‌ను నిరాకరించినట్లు తెలిపారు. అఫిడవిట్‌(నమూనా–26) నిర్ణీత నమూనాలో 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా సమర్పించనందున నామినేషన్‌ పత్రం నిరాకరించినట్లు రిటర్నింగ్‌ అధికారి వెంకటాచారి వెల్లడించారు. 

ములుగులో..
ములుగు నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థుల నామినేషన్‌ల పరిశీలనలో ఒక్కరిది మాత్రమే  చెల్లలేదు. మిగతా 15 మంది నామినేషన్లు పరిశీలనలో ఎటువంటి తప్పులు లేకపోవడంతో తిరస్కారానికి గురికాలేదు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అబ్జర్వర్‌ అనిమేష్‌దాస్, రిటర్నింగ్‌ అధికారి, ములుగు ఆర్డీఓ కె.రమాదేవిల ఆధ్వర్యంలో అభ్యర్థుల నామినేషన్‌ స్క్రూటినీ నిర్వహించారు. మొత్తం 16 మంది అభ్యర్థులు 25 సెట్లను అందించగా సీపీఎం అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన లక్ష్మీనారాయణ నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యింది. నిర్ణీత సమయంలో పార్టీ తరఫున బీఫాం సమర్పించకపోవడం, నామినేషన్‌ సమయంలో ఒక్కరు మాత్రమే ప్రతిపాదించడంతో నామినేషన్‌ చెల్లలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement