
సాక్షి, హైదరాబాద్ : అవినీతికి అలవాటు పడ్డ రైల్వే మేనేజర్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. కోటి రూపాయల బిల్లుల మంజూరు కోసం 15 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారుల ముందు బుక్కైపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే మేనేజర్‌గా పనిచేస్తున్న కె.వెంకటేశ్వరరావు ఓ కాంట్రాక్టర్ చేసిన పనుల బిల్లుల మంజూరుకు 15లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖా అధికారులను సంప్రదించారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పథకం ప్రకారం వెంకటేశ్వరరావు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు. మేనేజర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment