
సాక్షి, హైదరాబాద్ : సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలజీలో(సీసీఎంబీ) కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రేపటి(మంగళవారం) నుంచి సీసీఎంబీలో కరోనా పరీక్షలు జరపడానికి కేంద్రం అనుమతిచ్చింది. సీసీఎంబీలో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కొద్ది రోజుల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. కేసీఆర్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం సీసీఎంబీలో కరోనా పరీక్షల నిర్వాహణకు అనుమతిస్తున్నట్టు నేడు ప్రకటన చేసింది. దీంతో సీసీఎంబీ అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
కాగా, సీసీఎంబీలో రోజుకు 800 నుంచి 1000 శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యం ఉన్నట్టుగా నిపుణలు చెప్తున్నారు. రోజురోజుకు కరోనా అనుమానితులు సంఖ్య పెరుగుతున్న క్రమంలో సీసీఎంబీలో పరీక్షలు నిర్వహించడం ద్వారా త్వరితగగిన ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment