విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాపురం ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం సీహెచ్.రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హన్మకొండలో జరిగిన తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ముగిశాయి.
ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎ.నర్సిరెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో సీహెచ్.రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండాకు చెందిన ఉపాధ్యాయుడు సోమశేఖర్‌ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment