Ch ramulu
-
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాములు
విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాపురం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సీహెచ్.రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హన్మకొండలో జరిగిన తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎ.నర్సిరెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో సీహెచ్.రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండాకు చెందిన ఉపాధ్యాయుడు సోమశేఖర్‌ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
దుబాయిలో వలస కార్మికుడు మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వలస కార్మికుడు దుబాయిలో మరణించాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తాడూరు పంచాయతీ పాపయ్యపల్లికి చెందిన చెన్నవేని రాములు (41) గతేడాది ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. అక్కడ మరికొందరితో కలసి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి రాములకు తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సహచరులు ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందాడు. ఈ మరణవార్తను సహచరులు రాములు కుటుంబసభ్యులకు ఫోన్లో తెలిపారు. దీంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రాములుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.