తెలంగాణకు తీరనున్న కరెంటు కష్టాలు! | chhattisgarh to give 1000 mw power to telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు తీరనున్న కరెంటు కష్టాలు!

Published Sat, Oct 18 2014 3:08 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

తెలంగాణకు తీరనున్న కరెంటు కష్టాలు! - Sakshi

తెలంగాణకు తీరనున్న కరెంటు కష్టాలు!

తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు తీరే మార్గం కనిపించింది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా ఒప్పందం కుదిరితే విద్యుత్ వచ్చేందుకు వీలవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం సహా తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ కోతలు తీవ్రంగా అమలవుతున్నాయి. నగరంలో 2 నుంచి 4 గంటలు, గ్రామాల్లో అయితే దాదాపు 8 గంటల మేర విద్యుత్ కోతలు విధిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 7-8 రూపాయల చొప్పున కొంటున్నా, అది ఏమాత్రం సరిపోవట్లేదు.

దీంతో ప్రభుత్వం గతంలో ఛత్తీస్గఢ్తో మొదలైన చర్చలను పునరుద్ధరించింది. ఆ ప్రభుత్వం కూడా విద్యుత్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా లైను (కారిడార్) లేకపోవడం కూడా ఓ సమస్యగా మారింది. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుని, కారిడార్ నిర్మించుకోవడం, లేదా మరేదైనా మార్గం ద్వారా విద్యుత్తు తెప్పించుకోవడం చేయాలని భావిస్తున్నారు. ఇది జరిగితే తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు తీరిపోయినట్లే అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement