
‘సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలోలాగానే పంచాయతీ ఎన్నికల సందర్భంగానూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్‌కే జోషి స్పష్టం చేశారు. గతంలోనే మొదలైన పథకాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి పరిధిపై అధికార వర్గాల్లో అయోమయం నెలకొన్న నేపథ్యంలో జోషి ఈ మేరకు శుక్రవారం స్పష్టతనిచ్చారు. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని జోషి నిర్ణయించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల అధికారి వి.నాగిరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment