సాక్షి, హైదరాబాద్: ప్రభు త్వానికి చెల్లించాల్సిన బకాయిలను కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు.
అధికారులను తప్పుదోవపట్టించి.. వారిపై దురుసుగా ప్రవర్తించిన అఫ్సాన్, లిమ్‌రా ఏజెన్సీలు, హైదరాబాద్ సర్వీసు స్టేషన్, విశాల్ ఎంటర్‌ప్రైజెస్, భద్రయ్య సన్స్, శ్రీ అనంతుల ట్రేడర్స్, రాజయ్య అండ్ సన్స్, లక్ష్మయ్య అండ్ సన్స్, బీనా ట్రేడర్స్, తార్నాక ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
తప్పుడు సమాచారంతో కొంతమంది డీలర్లు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 66 మంది హోల్‌సేల్ కిరోసిన్ డీలర్ల నుంచి పౌరసరఫరాల శాఖకు రూ.10.12 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన కమిషనర్ శనివారం పౌరసరఫరాల భవన్‌లో బకాయిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment