జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లాలో ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీల సంఖ్య లెక్క తేలింది. గతంలో 64 జెడ్పీటీసీ, 982 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం ఆ సంక్య 71 జెడ్పీటీసీలు, 804 ఎంపీటీసీ స్థానాలకు చేరింది. ఈనెల 20వ తేదీన ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చేందుకు మండలాల్లో పునర్ విభజన డ్రాఫ్ట్ నోటిపికేషన్ జారీ చేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీ పదవీ కాలం జులై 4వ తేదీతో ముగుస్తుంది. ఈ మేరకు జూన్‌లో ఈ ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ప్రతిపాదనలు పంపింది. పూర్తయిన అభ్యర్థనల ప్రక్రియ కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ అవ్వగా ఆ రోజు నుంచి 22వ తేదీ వరకు అభ్యర్థనలు స్వీకరించారు. 23 నుంచి 24వ తేదీ వరకు అభ్యర్థలను పరిశీలించి సోమవారం తుది జాబితాను ప్రచురించారు.
ఈ ఎన్నికల్లో 2019 జరవరి 1 నాటికి ఓటర్ల జాబితాల్లో ఉన్న వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లజాబితాకు అనుగుణంగా ఓటర్ జాబితాను సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలోని గ్రామ పంచాయతీలు, వాటిలోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారును వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీలకు అమలు చేసినట్లు రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేన్ల విధానం ఖరారు చేయనున్నారు.
804 ఎంపీటీసీ స్థానాలు
ఎట్టకేలకు ఎంపీటీసీల లెక్క తేలింది. ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా 982 స్థానాలు ఉండేవి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 6 జిల్లాల వ్యాప్తం గా 804 స్థానాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసి అభ్యర్థలను స్వీకరించారు. వాటిని పరిశీలించి మొత్తంగా ఎంపీటీసీల స్థానాలను గుర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,80,971 జనాభా ఉంది. దీని ఆధారంగానే ఎంపీటీసీల స్థానాలను అధికారులు గు ర్తించారు. ప్రతి ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఎన్నిల నిబంధనల ప్రకారం 3500 జనాబా ఉండేలా జాగ్రత్త పడ్డారు.
దానికి అనుగుణంగానే ఎంపీ టీసీ స్థానాలను గుర్తించారు. 2014లో ఎన్నికలు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు మినహా గ్రామాల్లో 33,07,170 జనాభా ఉంది. దీని ప్రకారం ఎంపీటీసీ స్థానాలను నిర్ధారించా రు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 982 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. గత 2014లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల 982 స్థానాలకు, 64 జె డ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కొన్ని మండలాలు ఇతర జిల్లాల్లో కలిశాయి. ప్రస్తుత ఉమ్మడి జిల్లాలో 27,80, 971 జనాభా ఉంది. దాని ప్రకారం ఎంపీటీ సీ స్థానాలను గుర్తించగా దాని అనుగుణం గా 804 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాడ్డాయి.
71 జెడ్పీటీసీలు స్తానాలు...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 20 జెడ్పీటీసీ స్థానాలు పెరగనున్నాయి. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి మండల ప్రాదేశీక నియోజకవర్గానికి ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటుచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ముసాపేట్, రాజాపూర్, గండీడ్ (రంగారెడ్డి నుంచి జిల్లాలో కలిసింది), గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోలీ, కేటీ దొడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలో పెంట్లవెల్లి, ఊ ర్కొండ, చారకొండ, పదర, నారాయణ పేట్ జిల్లాలో కృష్ణ, మరికల్, వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అమరచింత మండలాలు కొత్తగా ఏర్పాడ్డాయి. వీటికి అధికారులు జెడ్పీటీసీ స్థానాలుగా గుర్తించి వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు.
నివేదికలోని ప్రధాన అంశాలు..
జెడ్పీటీసీ, ఎంపీసీటీ పునర్ విభజన స్థానా ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయగా 71 జెడ్పీటీసీ, 804 ఎంపీటీసీ స్థానాలుగా అధికారులు గుర్తించారు. ఇలా గుర్తించిన పూర్తి స్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్ అప్రొవల్‌తో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించిన తదుపరి ఆదేశాల మేరకు అధికారులు ఎన్నికల కసరత్తు ప్రారంభిస్తారు. ఏప్రిల్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేసన్లను ఖరా రు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండలాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అధికారులు మండలాల వారీగా ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నియోజకవర్గాల వారీగా ఓటరుజాబితాను సిద్ధం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడిచింది. ఈ జాబితా పూర్తి కాగానే పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కసరత్తు చేస్తారు. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రకియను మొదలు పెడతారు.
Comments
Please login to add a commentAdd a comment