
ఉదయం 9 నుంచి తరగతులు
కేజీబీవీ ప్రత్యేకాధికారుల భేటీలో కడియం నిర్ణయం
8 నుంచే నిర్వహణ రద్దు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సహకారంతో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) తరగతులను ఇకపై ఉదయం 8కి బదులు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్ణయించారు. గురువారం హైదరాబాద్‌లో ఇందిరా ప్రియ దర్శిని ఆడిటోరియంలో కేజీబీవీల ప్రత్యే కాధికారుల (ప్రిన్సిపాళ్లు) వార్షిక సమా వేశాన్ని ప్రారంభించిన కడియం.. ఈ విష యంలో ప్రత్యేకాధికారులు చేసిన విజ్ఞప్తిపై (ఉదయం 8 గంటలకే ప్రారంభించడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని) సాను కూలంగా స్పందించారు. అనంతరం మాట్లాడుతూ కేజీబీవీల్లో ఫలితాలను 100 శాతానికి పెంచాలని సూచించారు.
రాష్ట్రం లోని 391 కేజీబీవీల్లో 73 వేల మంది బాలి కలు చదువుతున్నారని, వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 212 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. భేటీ బచావో.. భేటీ పడావో పథకం కింద కేజీబీవీలను పటిష్టం చేయా లని కేంద్రాన్ని కోరామని, ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. ఊళ్లకు దూరంగా ఉన్న కేజీబీవీల్లో చదువుతున్న బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టా మన్నారు. ప్రతి కేజీబీవీకి కాంపౌండ్ వాల్స్ మంజూరు చేశామని, రాత్రిళ్లు కనీసం రెండు సార్లు పెట్రోలింగ్ నిర్వహించాలని జిల్లాల ఎస్పీలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారన్నారు.
బాలికలను కేవలం వారి తల్లిదండ్రులు, బంధువుల నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నాకే బయ టకు పంపాలన్నారు. చలికాలంలో విద్యార్థి నులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ. 4.70 కోట్లతో దుప్పట్లు అందిస్తున్నా మన్నారు. ప్రతి స్కూల్లో బయోమెట్రిక్ హాజరు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, రన్నింగ్ వాటర్, టాయ్‌లెట్స్ ఇతర సదు పాయాలను కల్పిస్తున్నామన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి బాలికలకు మంచాలు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కేజీబీవీ లకు కేంద్రం ప్రస్తుతం ఆరో తరగతి నుంచి 8 తరగతి వరకు మాత్రమే ఆర్థిక సహకారం అందిస్తోందని, దీన్ని 12వ తరగతి వరకు పెంచాలని, కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఇటీవల కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు చేస్తాం
టీచర్ల సర్వీసు రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని కేంద్ర మానవ వనరుల శాఖను కోరామని, త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని కడియం శ్రీహరి తెలిపారు. కేజీబీవీ టీచర్ల సమస్యల పరిష్కారానికి యూనియన్లు అవసరం లేదని.. టీచర్ల రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు బాధ్యత ఇకపై తనదేనన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్, అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.