Indira Priyadarshini Auditorium
-
సీపీఎస్ రద్దుపై ఒకే మాట..ఒకే బాట
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దు చేస్తామని వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు వెల్లడించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం సీపీఎస్‌పై ప్రతిపక్ష పార్టీలతో సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం నిర్వహించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో నేతలు తమ వైఖరి వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని తమ పార్టీల మేనిఫెస్టోల్లో దీన్ని చేర్చుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1న, ఆ తరువాత నియమితులైన రాష్ట్ర ఉద్యోగ, టీచర్లకు సీపీఎస్‌ను వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టు 23న జారీ చేసిన జీవోను రద్దు చేస్తామని, ఎన్పీఎస్ ట్రస్టు, పీఎఫ్ఆర్డీఏకు సీపీఎస్‌ను రద్దు చేయాలని లేఖ రాస్తామని, వారికి పాత పెన్షన్ విధానంను (1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్) వర్తింప చేస్తామని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, సీపీఎం పార్టీల తరపున లిఖితపూర్వక తీర్మానం చేసి, ఆయా పార్టీల నేతలు సంతకాలు చేశారు. ఉద్యోగులకు తోడుగా... సీపీఎస్ రద్దు విషయంలో పార్టీలన్నీ ఉద్యోగులకు బాసటగా నిలిచాయి. కాంగ్రెస్‌పార్టీ తప్పకుండా చర్యలు చేపడుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తన ప్రసంగంలో స్పష్టీకరించారు. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మన్ మాట్లాడుతూ ఉద్యోగులంతా తమ వెంట ఉండాలని, తాము ఉద్యోగుల వెంట ఉంటామన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చినా, అధికారంలో ఉన్న వారు దాన్ని రద్దు చేయాలన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగుల పెన్షన్ అనేది షేర్ మార్కెట్‌పై ఆధారపడకూడదన్నారు.సీపీఐ అధికార ప్రతినిధి పస్య పద్మ, సీపీఎం అధికారి ప్రతినిధి వేణుగోపాల్ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనన్నారు. ఈ సమావేశంలో సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు మ్యాన పవన్, కూరాకుల శ్రీనివాస్, రోషన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉదయం 9 నుంచి తరగతులు
కేజీబీవీ ప్రత్యేకాధికారుల భేటీలో కడియం నిర్ణయం 8 నుంచే నిర్వహణ రద్దు సాక్షి, హైదరాబాద్: కేంద్ర సహకారంతో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) తరగతులను ఇకపై ఉదయం 8కి బదులు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్ణయించారు. గురువారం హైదరాబాద్‌లో ఇందిరా ప్రియ దర్శిని ఆడిటోరియంలో కేజీబీవీల ప్రత్యే కాధికారుల (ప్రిన్సిపాళ్లు) వార్షిక సమా వేశాన్ని ప్రారంభించిన కడియం.. ఈ విష యంలో ప్రత్యేకాధికారులు చేసిన విజ్ఞప్తిపై (ఉదయం 8 గంటలకే ప్రారంభించడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని) సాను కూలంగా స్పందించారు. అనంతరం మాట్లాడుతూ కేజీబీవీల్లో ఫలితాలను 100 శాతానికి పెంచాలని సూచించారు. రాష్ట్రం లోని 391 కేజీబీవీల్లో 73 వేల మంది బాలి కలు చదువుతున్నారని, వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 212 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. భేటీ బచావో.. భేటీ పడావో పథకం కింద కేజీబీవీలను పటిష్టం చేయా లని కేంద్రాన్ని కోరామని, ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. ఊళ్లకు దూరంగా ఉన్న కేజీబీవీల్లో చదువుతున్న బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టా మన్నారు. ప్రతి కేజీబీవీకి కాంపౌండ్ వాల్స్ మంజూరు చేశామని, రాత్రిళ్లు కనీసం రెండు సార్లు పెట్రోలింగ్ నిర్వహించాలని జిల్లాల ఎస్పీలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారన్నారు. బాలికలను కేవలం వారి తల్లిదండ్రులు, బంధువుల నుంచి అండర్ టేకింగ్ తీసుకున్నాకే బయ టకు పంపాలన్నారు. చలికాలంలో విద్యార్థి నులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ. 4.70 కోట్లతో దుప్పట్లు అందిస్తున్నా మన్నారు. ప్రతి స్కూల్లో బయోమెట్రిక్ హాజరు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, రన్నింగ్ వాటర్, టాయ్‌లెట్స్ ఇతర సదు పాయాలను కల్పిస్తున్నామన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి బాలికలకు మంచాలు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కేజీబీవీ లకు కేంద్రం ప్రస్తుతం ఆరో తరగతి నుంచి 8 తరగతి వరకు మాత్రమే ఆర్థిక సహకారం అందిస్తోందని, దీన్ని 12వ తరగతి వరకు పెంచాలని, కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఇటీవల కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు చేస్తాం టీచర్ల సర్వీసు రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని కేంద్ర మానవ వనరుల శాఖను కోరామని, త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని కడియం శ్రీహరి తెలిపారు. కేజీబీవీ టీచర్ల సమస్యల పరిష్కారానికి యూనియన్లు అవసరం లేదని.. టీచర్ల రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు బాధ్యత ఇకపై తనదేనన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్, అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లుకు మోక్షం ఎప్పుడు?
12న తెలంగాణ బీసీ రాష్ట్ర మహాసభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన కృష్ణయ్య ముషీరాబాద్: పార్లమెంటులో బీసీ బిల్లు తప్ప అన్ని బిల్లులను ఆమోదిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ బిల్లు విషయానికొచ్చేసరికి అందరూ మొండిచేయి చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 12న ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరుగనున్న తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ వాల్‌పోస్టరును వివిధ బీసీ సంఘాల నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్,ఎ.రామ్‌కోఠి, ఎం.అశోక్‌కుమార్, కె.శ్రీనివాస్‌లతో కలిసి ఆవిష్కరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీలను రాజకీయంగా అణిచివేయడానికి అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. బీసీ ఓట్లతో గెలిచిన నేతలు పార్లమెంటులో నోరుమెదపకుండా మౌనం పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం తగ్గిపోయిందని, 119 స్థానాలకు కేవలం 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. 12న జరిగే తెలంగాణ బీసీ మహాసభలో బీసీ ఉద్యమాన్ని బలమైన శక్తిగా నిర్మించడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని, భవిష్యత్ ఉద్యమ కార్యచరణపై చర్చిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు వెంకటనారాయణ, బాల్‌రాజ్, మారేష్, రవీందర్, నర్సింహనాయక్, నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.